విజయదేవరకొండ చేసిన తప్పేంటి? ఎదుగుదల తటుకోలేకపోతునారా!

Advertisement

by Aravind Peesapati | July 30, 2019 13:02 IST
Follow Xappie
విజయదేవరకొండ చేసిన తప్పేంటి? ఎదుగుదల తటుకోలేకపోతునారా!

విజయదేవరకొండ చేసిన తప్పేంటి? ఎదుగుదల తటుకోలేకపోతునారా!
 
చిన్నచిన్న పాత్రలతో కష్టపడి హీరో గామారి యువతలో క్రేజు తెచుకునాడు విజయదేవరకొండ, ఒకరకంగా స్టార్ హీరోలకు దడ పుటిస్తునాడు, ఇది నిజం ఎవరు ఔనానా కాదన్నా, ఎన్నడూ లేని రీతిలో ఎవరూ చేయని విధంగా డియర్ కామ్రేడ్ కోసం అగ్రెసివ్ ప్రమోషన్ చేసిన విజయ్ దేవరకొండ దానికి తగ్గ ఫలితం అందుకునేలా కనిపించడం లేదు.
 
డివైడ్ టాక్ బాగా స్ప్రెడ్ అవుతుండటంతో దాని ప్రభావం బాగా పడింది, ఇప్పటిదాకా యూత్ అండదండలతో ఫాలోయింగ్ తో నెట్టుకొస్తున్న విజయ్ ఇకపై స్టార్ స్టేటస్ ని సుస్థిరపరుచుకోవాలి.ఇదిలా వుంటే సినిమా పెద్దలు విజయదేవరకొండ స్టార్ డం ని గుర్తించడం లేదా అని అనిపిస్తుంది, ఎందుకంటే స్టార్ హీరో పుత్రరతనలా సినిమాలు జయాపజయాలు తో సంబంధం లేకుండా అహో ఓహో అంటూ పొగిడే బజనపరులు విజయ్ సినిమాని చూడడానికి కూడా ఇష్టపడటం లేదు.
 
సాధారణంగా సినిమాలు ఫ్లాపు అయినా యావరేజ్ అయినా అయితే ఎక్కువగా డైరక్టర్ నే అందరూ ఎత్తి చూపుతారు. కథ, కథనాలు బాగా లేకున్నా కూడా డైరక్టర్ నే తప్పు పడతారు. ఎప్పుడో కానీ హీరో ఛాయిస్ రాంగ్ అని కానీ, హీరో తప్పు చేసాడని కానీ అనడం అరుదు. మహా అయితే ఈ కథ ఎలా ఓకే చేసాడు హీరో అని మాత్రం అంటారు.
 
అలాగే సినిమాలు బాగా లేకపోతే హీరోలు కెలికారు అన్న మాటలు కూడా అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి. అయితే అది సాధారణంగా ఎడిటింగ్ టేబుల్ మీద జరుగుతుంటుంది.
 
సినిమా స్క్రిప్ట్ డిస్కషన్లు జరిగాక, ఓసారి ఫైనల్ అయ్యాక హీరోలు సాధారణంగా టేకింగ్ లో కలుగచేసుకోరు. ఫైనల్ ఎడిటింగ్ అప్పుడు మాత్రం కాస్త చేయి చేసుకునే సందర్భాలు అందరు హీరోలకు వుంటాయి.
 
కానీ డియర్ కామ్రేడ్ విషయంలో ఇండస్ట్రీలో ఒపీనియన్లు వేరుగా వున్నాయి. పైకి ఎవ్వరూ ఏమీ అనకపోయినా, అందరూ హీరో విజయ్ నే తప్పు పడుతున్నారు. అర్జున్ రెడ్డి, గీతగోవిందం సినిమాలు పెద్దహిట్ కావడంతో అతనే మొత్తం ప్రాజెక్టు చేతిలోకి తీసుకుని, స్క్రిప్ట్ లో మార్పులు, రీషూట్ లే కాదు, డైరక్టర్ ను పక్కన కూర్చోపెట్టి, డైరక్షన్ కూడా చేసేసుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
 
ఇది ఏమైనా సోషల్ బర్నింగ్ ఇష్యూ తో వచ్చిన సినిమాని ముందుకు తీసుకోని పోవలిసిన అవసరం ఎంతైనా వుంది, యువతలో పాలోయింగ్ వున్నా హీరో క్రేజుని కాష్ చేసుకోకుండా మంచి పాయింట్ తో ముందుకు వచినందుకు ఇప్పటికైనా పెద్దలు అభినందించటం నేర్చుకోవాలి .


Advertisement


Advertisement

Top