Advertisement

సాహో కి ప్రభాస్ తీసుకున్న రెమ్యునరేషన్ తెలుసుకొని షాక్ అవుతున్న జనం..?

by Aravind Peesapati | July 31, 2019 13:29 IST
సాహో కి ప్రభాస్ తీసుకున్న రెమ్యునరేషన్ తెలుసుకొని షాక్ అవుతున్న జనం..?

సాహో కి ప్రభాస్ తీసుకున్న రెమ్యునరేషన్ తెలుసుకొని షాక్ అవుతున్న జనం..?
 
బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమాపై దేశవ్యాప్తంగా బీభత్సమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాకి దాదాపు నాలుగు భాషల్లో తెరకెక్కిన విషయం మనకందరికీ తెలిసినదే. హిందీలో బాహుబలి సినిమాని విడుదల చేసిన ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాని కూడా అదే స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు అలాగే హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఫైట్ మాస్టర్లు నటించడం ఈ సినిమాకి ప్లస్ అయ్యింది. ఆగస్టు 30వ తారీఖున విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు త్వరలోనే మొదలుపెట్టడానికి సినిమా యూనిట్ రంగం సిద్ధం చేసుకున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ప్రభాస్ స్నేహితులు డైరెక్టర్ సుజిత్ అలాగే నిర్మాత యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రభాస్ తీసుకున్న రెమ్యునరేషన్ పట్ల జనం షాక్ అవుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినబడుతున్నాయి. మొత్తం మీద చూసుకుంటే సాహో సినిమా కి ప్రభాస్ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు సినిమా కోసం పారితోషికం తీసుకోని ప్రభాస్ ప్రీరిలీజ్ బిజినెస్ లో యాభై శాతం వాటా తన పారితోషికంగా తీసుకోబోతున్నాడట. దాదాపు 300 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకు ప్రీరిలీజ్ బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.అంటే ఈ సినిమాకు ప్రభాస్ రెమ్యునరేషన్ వందకోట్లకు పైమాటే.. అదే గనుక నిజమైతే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల సరసన ప్రభాస్ నిలవనున్నాడు. ప్రస్తుతం ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.


Advertisement


Advertisement


Top