అవకాశం అడిగితే రామ్ గోపాల్ వర్మ నాకు సెక్స్ వీడియో పంపాడు అంటున్న హీరోయిన్..!

Written By Aravind Peesapati | Updated: August 19, 2019 14:11 IST
అవకాశం అడిగితే రామ్ గోపాల్ వర్మ నాకు సెక్స్ వీడియో పంపాడు అంటున్న హీరోయిన్..!

అవకాశం అడిగితే రామ్ గోపాల్ వర్మ నాకు సెక్స్ వీడియో పంపాడు అంటున్న హీరోయిన్..!

 
ప్రముఖ హీరోయిన్ షెర్లిన్ చోప్రా సెన్సేషనల్ కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. సినిమాలో అవకాశం కోసం రాంగోపాల్ వర్మ ని ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ మెసేజ్ పెట్టగా..సెక్స్ వీడియో నాకు పంపించాడు అని షెర్లిన్ చోప్రా ఇటీవల కామెంట్లు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విషయంలోకి వెళితే ‘మిడ్ డే' పత్రికతతో ఆమె మాట్లాడుతూ...ఇలా వర్మపై ఆరోపణలు చేసింది. మిడ్ డే పత్రిక షెర్లిన్ చోప్రాతో చేసిన ఇంటర్వ్యూలో భాగంగా..యాంకర్ రాంగోపాల్ వర్మ గురించి ప్రస్తావించారు. మీకు రాంగోపాల్ వర్మ ఏదో ఆఫర్ ఇచ్చాడని విన్నాము నిజమేనా అని ఆయన అడిగితే ఆమె ఇలా స్పందించింది. షెర్లిన్ చోప్రా మాట్లాడుతూ.. ‘నాకు మొదటి నుంచీ రామ్ గోపాల్ వర్మ అంటే ఇష్టం. ఆయన సినిమాలు బాగా నచ్చుతాయి. వాటిలో హీరోయిన్‌ను బాగా చూపిస్తాడు. అది గమనించి ఆయనకు 2016లో వాట్సాప్‌లో నా ఫొటోలు, నా వివరాలు పంపుతూ... మీ సినిమాలో ఏదైనా వేషం ఉంటే ఇవ్వండి అని అడిగాను' అని ఆమె చెప్పుకొచ్చింది.అప్పుడు వర్మ తన మెసేజ్‌కు వర్మ రిప్లై ఇస్తూ.... ‘ఓ స్క్రిప్టు పంపిస్తున్నాను. ఇది చదవి చెప్పు. నచ్చితే వెంటనే సినిమా చేద్దాం' అన్నారట. ‘ఏక్‌థా రాజా ఏక్‌థి రాణి' అనే టైటిల్ ఉన్న ఆ స్క్రిప్టు చదివింది. అందులో సెక్స్ సీన్స్ తప్ప కథ ఏమీ కనిపించలేదని షెర్లిన్ చెప్పుకొచ్చింది. ఆ కథ మొత్తం ఓ రాజు రాణికి మధ్య శృంగారం, అందుకు సంభందించిన సీన్స్ మాత్రమే ఉన్నాయంది. అదే విషయాన్ని వర్మకు రిప్లై చేసానని దానికి ఆయన మాత్రం కూల్ గా..నీకు కథ నచ్చితే చెప్పు లేకపోతే లేదు అన్నాడని వివరించింది. దీంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి.Top