‘RRR’ సినిమాలో ఎన్టీఆర్ కి హీరోయిన్ దొరికేసింది..?

Advertisement

by Aravind Peesapati | July 23, 2019 19:37 IST
Follow Xappie
 ‘RRR’ సినిమాలో ఎన్టీఆర్ కి హీరోయిన్ దొరికేసింది..?

‘RRR’ సినిమాలో ఎన్టీఆర్ కి హీరోయిన్ దొరికేసింది..?
 
బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా 'RRR'. రాంచరణ్, ఎన్టీఆర్ ను హీరోలుగా పిరియాడిక్ యాక్షన్ డ్రామా గా రాజమౌళి తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాని. దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ పక్కన హీరోయిన్ గా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అలియాభట్ నటిస్తోంది. అయితే ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా గతంలో హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన డైసీ ఎడ్గర్ జోన్స్ ని ఎంపిక చేశారు. అయితే ఆమె కొన్ని కారణాల వలన ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో మరో హాలీవుడ్ నటి కోసం వెతుకులాట మొదలుపెట్టారు.
 
అయితే ఆ క్యారెక్టర్ ని మార్చేశారని, ఫారెన్ అమ్మాయిని తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా ఓ ఫారెన్ నటిని తీసుకున్నట్లు సమాచారం. అమెరికన్ నటి, గాయని ఎమ్మారాబర్ట్స్ ని 'RRR'లో హీరోయిన్ గా ఎంపిక చేశారట. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే హాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో నటించింది కానీ మొట్టమొదటిసారి ఇండియన్ సినిమాల్లో ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా నటించడం విశేషం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. వచ్చే సంవత్సరం జులై మాసానికి విడుదల చేయటానికి సినిమా యూనిట్ ఇప్పటినుండి గట్టిగా ప్రయత్నిస్తోంది.


Advertisement


Advertisement

Top