చంద్రబాబు కంచుకోట బద్దలు అయిపోయే స్కెచ్ లు వేస్తున్నజగన్..!

By Xappie Desk, January 22, 2019 11:55 IST

చంద్రబాబు కంచుకోట బద్దలు అయిపోయే స్కెచ్ లు వేస్తున్నజగన్..!

2014 ఎన్నికలలో చేతిదాకా వచ్చిన అధికారం చివరిలో వైసీపీ అధినేత జగన్ కి మిస్ అయిపోయింది. ముఖ్యంగా అబద్ధపు హామీలు ఇవ్వలేక చేయగలిగిన పనులకు సంబంధించిన హామీలు మాత్రమే ఇవ్వటంతో అలాగే చంద్రబాబు మరియు పవన్ మోడీలు కలిసి పోటీ చేయడంతో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో అధికారం కోల్పోయారు. అంతేకాకుండా 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాని అద్భుతంగా ఉపయోగించుకుని వైఎస్ జగన్ పై లేనిపోని ప్రచారాలు తెగబడటం కూడా వైయస్ జగన్ కి గత ఎన్నికలలో అధికారాన్ని దూరం చేసింది.
 
ఇన్ని దెబ్బలు తిన్న జగన్ ఏపీలో రాబోయే ఎన్నికల్లో ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ చంద్రబాబు కంచుకోట బద్దలు అయిపోయేలా స్కెచ్లు వేస్తున్నారు. ఇప్పటికే పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి నమ్మకాన్ని పొందుకున్న జగన్... గత ఎన్నికల్లో జరిగిన పొరపాటును ఈ సారి మళ్లీ రిపీట్ చేయొద్దని జగన్ భావించారు, అందుకే నాలుగేళ్ళ క్రితమే సోషల్ మీడియాకు సంబందించిన నిపుణులను నియమించుకున్నారు. వైసీపీ సోషల్ మీడియా విభాగం గత నాలుగేళ్లుగా చంద్రబాబు, లోకేష్ లను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతలు చేస్తున్న అవినీతిని బట్టబయలు చేస్తూ టీడీపీ శ్రేణులకు నిద్ర పట్టనివ్వటం లేదు. ఇదే క్రమంలో రానున్న ఎన్నికల్లో సోషల్ మీడియా మరింత యాక్టివ్ గా ఉండాలని తాజాగా జగన్ సోషల్ మీడియాకు సంబంధించిన నిపుణులతో సమావేశం కానున్నట్లు సమాచారం.Top