Advertisement

Advertisement

Advertisement

టీడీపీ జనసేన పొత్తు గ్యారెంటీ..?

by Xappie Desk | January 23, 2019 12:34 IST
టీడీపీ జనసేన పొత్తు గ్యారెంటీ..?

మరికొద్ది నెలల్లో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఏపీలో రాజకీయ ముఖచిత్రం గమనిస్తే ప్రస్తుతం మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకొంది. జనసేన వైసిపి టిడిపి వీటిలో పోటీ ఎక్కువగా మాత్రం అధికార పార్టీ టిడిపి మరియు ప్రతిపక్ష పార్టీ వైసీపీ మధ్య నెలకొంది. సర్వేల బట్టి చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు జాతీయ సర్వేలో లోను మరియు ప్రముఖ సంస్థల సర్వేల్లో ఫలితాలు వస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ టిడిపి 2014 ఎన్నికల మాదిరిగా రాబోయే ఎన్నికల్లో కూడా జనసేన పార్టీతో కలిసి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఏపీ రాజకీయాల్లో వినపడుతున్న టాక్.
 
అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం ఇటీవల పొత్తుల గురించి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో 175 స్థానాల్లో జనసేన పార్టీ వామపక్షాలతో తప్ప వేరే ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసే అవకాశాలు లేవని తేల్చేశారు. మరో పక్క టిడిపి నాయకులు మాత్రం కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తో నే పోటీ చేయాలని అప్పుడే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని టీడీపీ అధినేత చంద్రబాబుకు సలహాలు ఇస్తున్నారు. మరోపక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జ‌న‌సేన‌కు, వామ‌ప‌క్షాల‌కు మ‌ధ్య అవ‌గాహ‌న ఏర్ప‌డాల్సిన అవ‌స‌రం వుంద‌ని తేల్చారు. ఈ నేప‌థ్యంలో ఈ నెల 25న విశాఖ‌లో వామ ప‌క్ష పార్టీల జాతీయ నాయ‌కులు సీతారాం ఏచూరి, సుర‌వ‌రం సుధాక‌ర్‌రెడ్డిల‌తో ఎన్నిక‌ల మేనిఫెస్టో, ప్ర‌త్య‌ర్థుల‌పై ఎదురుదాడికి సంబంధించిన విష‌యాల‌పై చ‌ర్చించ‌నున్నార‌ట‌.
 
ఈ చ‌ర్చ‌లు కొలిక్కి వ‌స్తే వామ‌ప‌క్షాల‌తో పొత్తు పై క్లారిటీ వస్తుందని సమాచారం. ఈ క్రమంలో ఈ పొత్తుల విషయంలో ఏమాత్రం ఏదైనా విషయం లో బెడిసికొడితే మాత్రం కచ్చితంగా పవన్ కళ్యాణ్ టిడిపితో కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోపక్క జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు కచ్చితంగా మా నాయకుడు మా హీరో తిరిగి చంద్రబాబుతో కలిసే ప్రసక్తే లేదని కామెంట్లు చేస్తున్నారు. మరి 25వ తారీకు తర్వాత ఏం జరుగుతుందో చూడాలి.


Advertisement


Advertisement

Top