ఆ పార్టీ నుండి పోటీ చేయబోతున్న కమెడియన్ ఆలీ..?

Advertisement

by Xappie Desk | January 23, 2019 12:39 IST
Follow Xappie
ఆ పార్టీ నుండి పోటీ చేయబోతున్న కమెడియన్ ఆలీ..?

ఎన్నికలు వస్తున్న తరుణంలో ఏపీలో ప్రముఖులు మరియు సినిమా రంగానికి చెందిన వాళ్లు ప్రధాన పార్టీల లో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల తెలుగు సినిమా రంగానికి చెందిన కమెడియన్ అలీ పొలిటికల్ ఎంట్రీ గురించి ఇటీవల అనేక వార్తలు ఏపీ మీడియా వర్గాలలో వచ్చాయి. ఈ క్రమంలో ఓ ప్రముఖ న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమెడియన్ ఆలీ మాట్లాడుతూ మంత్రి పదవి ఇస్తేనే ఏదైనా పార్టీలో చేరుతానని స్పష్టం చేశారు.
 
తాజాగా ఇటీవల ఆలీ తెలుగుదేశం పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు గుంటూరు -1 అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఈ క్రమంలో బాబు తో మంతనాలు కూడా జరిగినట్లు బాబు కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇదే క్రమంలో అలీ కంటే బలమైన అభ్యర్థి దొరికితే గుంటూరు1 టికెట్ సదరు నేతకు ఇవ్వాలని లేని పక్షంలో అలీకే సీటు కన్ఫర్మ్ చేయాలన్న ఆలోచనలో బాబు ఉన్నట్లుగా సమాచారం. ఇలాంటి హామీలు ఇచ్చేసి.. తీరా బీ ఫారం చేతికి ఇవ్వాల్సిన వేళలో.. సారీ అంటూ సింఫుల్ గా చెప్పే అలవాటున్న బాబు.. అలీ విషయంలో ఏం చేస్తారో చూడాలి.


Advertisement


Advertisement

Top