శారదా స్కాంలో బాబు హస్తం ఉందా..?

Advertisement

by Xappie Desk | February 05, 2019 13:04 IST
Follow Xappie
శారదా స్కాంలో బాబు హస్తం ఉందా..?

ఇటీవల పశ్చిమబెంగాల్లో శారదా స్కామ్ విషయమై విచారణ నిమిత్తం పశ్చిమ బెంగాల్ పోలీసులను సిబిఐ అధికారులు విచారించడం పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో పశ్చిమ బెంగాల్‌లో మమతాబెనర్జీ కి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వడంపై బిజెపి అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవ చేశారు. గుమ్మడికాయ దొంగలు ఎవరంటే మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు చంద్రబాబు అని ఆయన ప్రశ్నించారు.
 
‘కొంపతీసి 'శారదా స్కామ్'లో కూడా 'తమరి హస్తం' ఉందా?!? ' పచ్చ కామెర్లు' వాడికి లోకం 'పచ్చగా' కనిపిస్తుందని సామెత మీకు వర్తిస్తుంది’ అని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో దీదీ గుండాగిరి, చంద్రబాబు దాదాగారి మరెంతో కాలం సాగదని అన్నారు. ‘కాకినాడలో మహిళలను ఫినిష్ చేస్తా అన్నప్పుడు ఏమైంది మీ ప్రజాస్వామ్యం? అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేని దూషించినప్పుడు ఏమైంది ప్రజాస్వామ్యం? సెక్రటేరియట్లో నాయీబ్రాహ్మణులను బెదిరించినప్పుడు ఏమైంది ప్రజాస్వామ్యం?’అని వరుస ట్వీట్లలో చంద్రబాబును కన్నా ప్రశ్నించారు. ప్రజా సమస్యల నిమిత్తం Secretary దగ్గరికి వచ్చిన ప్రజలను దారుణంగా media ముందే దూషించిన నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతావా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు చంద్రబాబుపై కన్నా లక్ష్మీనారాయణ.


Advertisement


Advertisement

Top