చింతమనేని ని కాపాడటానికి అష్టకష్టాలు పడుతున్న ఎల్లో మీడియా..!

By Xappie Desk, February 22, 2019 11:18 IST

చింతమనేని ని కాపాడటానికి అష్టకష్టాలు పడుతున్న ఎల్లో మీడియా..!

ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే దెందులూరు నియోజకవర్గానికి చెందిన చింతమనేని ప్రభాకర్ నియోజకవర్గంలో శ్రీరామవరం అనే ప్రాంతంలో ఉన్న దళితుల పట్ల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాలలో కలకలం రేపుతున్నాయి. దళితులను ఉద్దేశించి చింతమనేని చేసిన వ్యాఖ్యల పట్ల దళిత సంఘాలు మండిపడుతున్నాయి. ఇంతటి దారుణంగా దళితులపై మాట్లాడి దూషించిన చింతమనేని పై చంద్రబాబు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు దళిత మేధావులు.
 
ప్రస్తుతం సోషల్ మీడియాలో దళితులపై చింతమనేని చేసిన వీడియో పట్ల చాలామంది ఆగ్రహం చెందుతున్నారు. ఇంతటి దారుణమైన కులగజ్జి ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదని చింతమనేని పై సీరియస్ అవుతున్నారు. అయితే మరోపక్క తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాసే ఓ వర్గం మీడియా చింతమనేని ని వెనకేసుకోవడం కి నానా తంటాలు పడుతూ లేనిపోని కథనాలు ప్రసారం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో వీడియోలు చూపించి పరోక్షంగానే ఆయన్ను వెనకేసుకొస్తోంది. చింతమనేని ఏ సందర్భంలో ఆ మాటలు మాట్లాడారో తెలీదంటూ, ఆ వ్యాఖ్యలకు ముందు, ఆ తరవాత మాట్లాడిన మాటలేమిటో వీడియోలో లేవంటూ సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించింది. మొత్తం మీద చింతమనేని దళితుల పట్ల చేసిన వ్యాఖ్యల పట్ల చాలామంది సామాజిక వేత్తలు మరియు సీనియర్ రాజకీయ నేతలు మండిపడుతున్నారు. ఇదే క్రమంలో కుల రాజకీయాలు చేయటానికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని కామెంట్లు చేస్తున్నారు విపక్ష పార్టీ నేతలు.Top