చింతమనేని ప్రభాకర్ నీ వెనకేసుకొస్తున్న చంద్రబాబు…!

Written By Xappie Desk | Updated: February 23, 2019 12:53 IST
చింతమనేని ప్రభాకర్ నీ వెనకేసుకొస్తున్న చంద్రబాబు…!

తెలుగుదేశం పార్టీలో దూకుడుగా ఉండే ఎమ్మెల్యే దెందులూరు నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ ఇటీవల దళితులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. చింతమనేని చేసిన ప్రసంగం మొత్తం సోషల్ మీడియాలో రావడంతో చాలా మంది నెటిజన్లు చింతమనేని ప్రభాకర్ పై దారుణమైన కామెంట్లు మరియు వ్యాఖ్యలు చేశారు. అయితే ఇంత జరిగినా గాని చంద్రబాబు చింతమనేని పై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేకపోవడంతో చంద్రబాబు వైఖరిపై చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు సామాజికవేత్తలు అసూయ పడుతున్నారు. అయితే చింతమనేని వ్యవహారం పట్ల వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటుకి ఆయనకి పెద్ద దెబ్బే పడుతుందని విశ్లేషకులు అంచనా వేయగా ఇప్పుడు చంద్రబాబు ఈ అంచనాలను తల కిందులు చేస్తున్నారని తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో కూడా చింతమనేని ప్రభాకర్ కు చంద్రబాబు ఎమ్మెల్యే సీటుకి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, చింతమనేని ఎన్ని చేసినా సరే అవన్నీ చంద్రబాబుకి మంచి కోణంలోనే కనిపించినట్టున్నాయి అందుకే మళ్ళీ ఎమ్మెల్యే సీటు ఇచ్చేందుకు సిద్ధపడి ఉండొచ్చని విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Top