కుల పిచ్చి రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ అని అంటున్న బిజెపి పార్టీ నేత…!

By Xappie Desk, February 26, 2019 12:42 IST

కుల పిచ్చి రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ అని అంటున్న బిజెపి పార్టీ నేత…!

కుల పిచ్చి రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ అని అంటున్న బిజెపి పార్టీ నేత…!
 
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దారుణంగా మోసం చేసిందని ..యువజన తో నష్టపోయిన ఆంధ్రరాష్ట్రంలో పార్లమెంట్ సాక్షిగా రావలసిన విభజన హామీల విషయంలో మొండివైఖరి ప్రధాని మోడీ ప్రదర్శించారని పేర్కొంటూ మీడియా ముందు లబోదిబోమంటున్నారు టీడీపీ నేతలు. ఈ క్రమంలో బీజేపీ నేతలు టీడీపీ నేతలు చేస్తున్న కామెంట్లను కొట్టిపారేస్తూ దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వని నిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని వాటిని చంద్రబాబు నాయుడు తన స్వార్ధ రాజకీయం కోసం వాడుకున్నారని కామెంట్లు చేస్తున్నారు.
 
ఇదిలా ఉండగా తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ కుల రాజకీయాలు చేస్తోందని బిజెపి ఎమ్.పి జివిఎల్ నరసింహారావు విమర్శించారు. టిడిపి కుల రాజకీయాలపైన, ఆ పార్టీ ప్రభుత్వ అవినీతిపైన చర్చకు సిద్దమా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సవాల్ చేస్తున్నానని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల చరిత్రలో గతంలో తానెన్నడూ కుల రాజకీయాలను చూడలేదని అన్నారు. దేశంలో ఇంతవరకూ ఎవరూ కూడా కులం విషయంలో బీజేపీ పై వేలెత్తి చూపలేదని స్పష్టం చేశారు. తమ పార్టీ అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యం ఇస్తుందని ఆయన అన్నారు.మోదీ ప్రభుత్వం రైతులకు ‘కిసాన్‌ సమ్మాన్‌’ నిధి కింద రెండు వేల రూపాయలు ఇస్తుండటంతో.. చంద్రబాబు అన్నదాత సుఖీభవ అనే స్టిక్కర్‌ కార్యక్రమానికి తెర తీశాడని నరసింహారావు ఆరోపించారు.



Top