వైసిపి పార్టీ కి భారీగా మద్దతు తెలుపుతున్న టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ..!

Written By Xappie Desk | Updated: March 09, 2019 12:49 IST
వైసిపి పార్టీ కి భారీగా మద్దతు తెలుపుతున్న టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ..!

వైసిపి పార్టీ కి భారీగా మద్దతు తెలుపుతున్న టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ..!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఇప్పటికే రాష్ట్రంలో జరుగుతున్న అన్ని సర్వేలలో వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని జగన్ ముఖ్యమంత్రి అవడం ఖాయమని ఫలితాలు వస్తున్న నేపథ్యంలో చాలా మంది సీనియర్ రాజకీయ నేతలు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న ప్రముఖులు వైసీపీ పార్టీ కండువా కప్పుకోవడానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది ఇప్పటికే జగన్ కి జై కొట్టారు. ఈ నేపథ్యంలో ఇటీవల సినీ రంగానికి చెందిన పలువురు సినీ ప్రముఖులు కూడా వైసీపీ లో చేరిపోయారు.
 
హాస్య నటుడు జోగినాయుడు తో సహా పలువురు సినీ ఆర్టిస్టులు నేడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రముఖ వైసీ నేత సజ్జల రామకృష్ణ రెడ్డి గారు లోటస్ పాండ్ లో పార్టీ కండువాలతో వీరందరిని వైసీపీ లోకి ఆహ్వానించారు… నటులు పృథ్వి, కృష్ణుడు ఆధ్వర్యంలో వీరంతా వైఎస్సార్‌సీపీలో చేరారు. జయశ్రీ, పద్మరేఖ, ఆశ, ప్రిద్విక, మీనాక్షి తేజస్విని తదిరులు వైఎస్సార్‌సీపీలో చేరిన వారిలో ఉన్నారు. దాదాపుగా వైసీపీ పార్టీలో ఒక వైపు సినీ రంగం తళుక్కున మెరవబోతుందని తెలుస్తుంది. ఇదే కాకుండా ఎన్నికల ముందు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న బడా హీరోలు కూడా వైసీపీ పార్టీ కండువా కప్పుకోవడానికి రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Top