ఓటమి పక్కా అని ఫిక్స్ ఐన చీరాల టీడీపీ - ఏం చెయ్యాలో తెలీక ఇలా చీప్ ట్రిక్స్

Written By Xappie Desk | Updated: March 09, 2019 18:13 IST
ఓటమి పక్కా అని ఫిక్స్ ఐన చీరాల టీడీపీ - ఏం చెయ్యాలో తెలీక ఇలా చీప్ ట్రిక్స్

ఓటమి పక్కా అని ఫిక్స్ ఐన చీరాల టీడీపీ - ఏం చెయ్యాలో తెలీక ఇలా చీప్ ట్రిక్స్
 
మీడియాని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం లో తెలుగుదేశం పార్టీకి మించినది లేదని చాలామంది టిడిపి రాజకీయ ప్రత్యర్థులు సీనియర్ రాజకీయ నేతలు కామెంట్లు చేస్తుంటారు. అయితే తాజాగా సోషల్ మీడియా వెలుగులోకి వచ్చిన క్రమంలో టీడీపీ చేస్తున్న నీచ రాజకీయాలు బయటపడ్డ కుక్క తోక వంకర అన్నట్టు గా తన వంకరబుద్ధి మానుకోవడం లేదు తెలుగుదేశం పార్టీ. ఎన్నికలు వస్తున్న క్రమంలో బలమైన ప్రత్యర్థులపై ఒకపక్క తన ఎల్లో మీడియా తో మరో పక్క పెయిడ్ సోషల్ మీడియా వెబ్ సైట్స్ లో రకరకాల ఆరోపణలు ప్రజలను గందరగోళానికి గురి చేసే విధంగా చేస్తున్నారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు.
 
ఈ క్రమంలో రాష్ట్రంలో చీరాల నియోజకవర్గంలో ఇటీవల చీరాల నియోజకవర్గ ప్రజల అభిప్రాయాల మేరకు నిజమైన రాష్ట్ర అభివృద్ధికై వైసీపీ పార్టీలో చేరిన ఆమంచి కృష్ణమోహన్ పై తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓ వెబ్ సైట్ చండాలమైన కథనాన్ని ప్రచురించి చీరాల నియోజకవర్గ ప్రజలను అయోమయానికి గురి చేయడానికి ప్రయత్నించింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సదరు వెబ్ సైట్ లో ఆమంచి కృష్ణమోహన్ చీరాల నియోజకవర్గం నుండి ఓడిపోతున్నటు జగన్ సర్వేలో తేలినట్లు ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో ఆమంచి కృష్ణమోహన్ కి వైసిపి పార్టీ టికెట్ ఇవ్వనట్లు దారుణమైన రాతలు రాసింది. ఏకంగా ఆమంచి కృష్ణమోహన్ పై జగన్ మూడు సర్వేలు చేయించినట్లు సదరు వెబ్సైట్ కథనాన్ని ప్రచురించింది.
 
ఒక విధంగా వైసీపీ అధినేత జగన్...ఆమంచి కృష్ణమోహన్ ఇద్దరూ ముక్కుసూటి మనుషులు అని చెప్పటంలో..ముక్కుసూటి రాజకీయాలు చేయడంలో వీరిద్దరికి మించిన వారు రాష్ట్రంలో ఎవరూ లేరని చెప్పవచ్చు. ఇందుమూలంగా నేమో జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రలో ఆమంచి నియోజకవర్గం చీరాలలో పర్యటించిన సందర్భంలో జరిగిన భారీ బహిరంగ సభలో కూడా ఎక్కడా కూడా ఆమంచి కృష్ణమోహన్ పై ఆరోపణలు చేయకుండా.. తనకి ఆమంచి కృష్ణమోహన్ పై ఉన్న అభిప్రాయాన్ని అనవసరమైన ఆరోపణలు చేసి పోనీయకుండా పకడ్బందీగా ఆ సమయంలో రాజకీయాన్ని ప్రదర్శించారు జగన్. అంతేకాకుండా ఇటీవల జగన్ నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతంలో కట్టుకున్న ఇంటిలో వచ్చిన సమయంలో మొట్టమొదటిగా ఆమంచి కృష్ణమోహన్ కి వైసిపి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి కూడా ఆహ్వానించారు.
 
ఇంతగా వైసీపీ అధినేత జగన్ ఆమంచి కృష్ణమోహన్ పై నమ్మకం కలిగి ఉంటే సదరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వెబ్ సైట్ చీరాల నియోజకవర్గ ప్రజలను మరియు రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించే విధంగా కథనాన్ని ప్రచురించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు వైసిపి నేతలు మరియు చీరాల నియోజకవర్గ ప్రజలు. ఇదే క్రమంలో ఇటువంటి చిల్లర రాజకీయాలు చేసే తెలుగుదేశం పార్టీ కూడా రోజులు దగ్గరపడ్డాయి అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు వైసిపి నేతలు మరియు చీరాల నియోజకవర్గ ప్రజలు. మార్ఫ్ ఫోటో లు చెయ్యడం , జరగని సర్వే జరిగింది అని చెప్పుకోవడం చూస్తుంటే వీరి మీద జాలి పడాలో , నవ్వాలో , కోప్పడాలో అర్ధం కాని పరిస్థితి.
Top