చంద్రబాబు, జేడీ లక్ష్మీనారాయణ లపై సంచలన కామెంట్స్ చేసిన విజయసాయిరెడ్డి..!

By Xappie Desk, March 19, 2019 11:57 IST

చంద్రబాబు, జేడీ లక్ష్మీనారాయణ లపై సంచలన కామెంట్స్ చేసిన విజయసాయిరెడ్డి..!

చంద్రబాబు, జేడీ లక్ష్మీనారాయణ లపై సంచలన కామెంట్స్ చేసిన విజయసాయిరెడ్డి..!
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ కేసుల విషయంలో కీలకంగా వ్యవహరించిన సిబిఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ ను ఉద్దేశించి వైసీపీ పార్టీ సీనియర్ నాయకుడు విజయసాయి రెడ్డి చేసిన కామెంట్స్ రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెను సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాబోతున్న ఎన్నికలలో పోటీ చేస్తానని చెప్పి మహారాష్ట్రలో తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లో అడుగు పెట్టిన జేడీ లక్ష్మీనారాయణ ఇటీవల జనసేన పార్టీ లో చేరారు.
 
గతంలో తెలుగుదేశం పార్టీ లేకపోతే బీజేపీ పార్టీలో చేరుతారన్న వార్తలను తలకిందులుగా చేసి జేడీ లక్ష్మీనారాయణ పవన్ కళ్యాణ్ పార్టీలోకి వెళ్లడంతో చాలా మంది షాక్ తిన్నారు. ఈ నేపథ్యంలో జె డి పవన్ కళ్యాణ్ పార్టీలోకి వెళ్లిన నేపథ్యంలో విజయసాయిరెడ్డి ట్విట్టర్లో సెటైర్లు వేశారు…. ఇప్పుడు జనసైనికుడిగా మారడమేమిటి లక్ష్మినారాయణ గారూ. మీరు మొదటి నుంచి చంద్రబాబు ఆదేశాల ప్రకారం నడుచుకునే జవానే గదా. పచ్చ పార్టీలో చేరితే ప్రజలు ఛీకొడతారని అనుబంధ సంస్థలో చేరారు. ఇన్నాళ్లు ఎవరి కోసం పనిచేసారో, ఇకపై ఏం చేస్తారో తెలియదనుకుంటే ఎలా?..నీతో విజయసాయి రెడ్డి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి.Top