Advertisement

Advertisement

Advertisement

గుడివాడలో బెజవాడ రాజకీయాలు పనికిరావు: కొడాలి నాని

by Xappie Desk | March 24, 2019 10:38 IST
గుడివాడలో బెజవాడ రాజకీయాలు పనికిరావు: కొడాలి నాని

గుడివాడలో బెజవాడ రాజకీయాలు పనికిరావు: కొడాలి నాని
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు ఒకలా ఉంటే కృష్ణాజిల్లాలో జరుగును రాజకీయ పరిణామాలు చాలా ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎలాగైనా ఆ స్థానాన్ని గెలవాలని కొడాలి నాని ని దించాలని...టిడిపి అధినేత చంద్రబాబు బెజవాడ కు చెందిన దేవినేని అవినాష్ ని రంగంలోకి దింపారు.
 
ఈ సందర్భంగా ఇటీవల ఓ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న కొడాలి నాని మాట్లాడుతూ..గుడివాడ నియోజకవర్గంలో బెజవాడ గూండాలను రౌడీలను దింపి రాజకీయాలు చేయాలని చంద్రబాబు చూస్తున్నారంటూ..ఇందుమూలంగా నే దేవినేని అవినాష్ ని రంగంలోకి దింపారని..ఎక్కడ నుండి ఎవరు వచ్చినా కానీ గుడివాడలో ఎగిరేది వైసీపీ జెండా అని. ఎందుకంటే కొడాలి నాని ది ఇల్లు గుడివాడ అని..కొడాలి నాని రాజకీయం మొత్తం గుడివాడ చుట్టూనే తిరిగింది కొడాలి నాని గుడివాడ ప్రజలకు ఏం చేశారు అని తెలుసు అంటూ నా ఇల్లు తెలుసంటూ నా ఫోన్ నెంబర్ తెలుసు అంటూ పార్టీ కార్యక్రమంలో కొడాలి నాని ప్రసంగించారు. నా ముందు పిల్ల రాజకీయ నాయకుడిని రంగంలోకి దింపిన చంద్రబాబుకి రాబోయే ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెబుతాం అని పేర్కొన్నారు కొడాలి నాని. బెజవాడలో వేసిన రౌడీ వేషాలు గుడివాడ లో వేస్తే ఊరుకోం అంటూ నియోజకవర్గంలో ఏ సామాన్యుడికె గాని కార్యకర్తకె గాని ఏదైనా జరిగితే...ఊరుకునే ప్రసక్తే లేదని...ఘాటు గా మాట్లాడారు నాని.


Advertisement


Advertisement

Top