వైయస్ వివేకానంద రెడ్డి హత్య పై సంచలన కామెంట్స్ చేసిన చంద్రబాబు..!

Written By Xappie Desk | Updated: March 25, 2019 10:32 IST
వైయస్ వివేకానంద రెడ్డి హత్య పై సంచలన కామెంట్స్ చేసిన చంద్రబాబు..!

వైయస్ వివేకానంద రెడ్డి హత్య పై సంచలన కామెంట్స్ చేసిన చంద్రబాబు..!
 
వైసీపీ అధినేత జగన్ చిన్నాన వైయస్ వివేకానంద రెడ్డి ఇటీవల హత్య చేయబడిన సంగతి అందరికీ తెలిసినదే. వైయస్ వివేకానంద రెడ్డి హత్య పై వైసీపీ పార్టీకి చెందిన చాలామంది నాయకులు కడప జిల్లా ప్రాంతానికి చెందిన కార్యకర్తలు ఎంతగానో బాధ పడ్డారు. ఈ హత్య గురించి అధికార పార్టీ టీడీపీ..వైసీపీ పార్టీకి చెందిన నేతలే మరియు దీంతో కుటుంబ సభ్యులు చంపేసి శవ రాజకీయాలు చేస్తున్నారు అంటూ అనేక కామెంట్లు చేశారు. ఇదిలా ఉండగా తాజాగా కడప జిల్లాలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ హత్య ఎవరు చేయించారో అందరికీ అర్ధమయ్యిందని, ఉదయాన్నే గుండె పోటు అని వారి పత్రిక మరియు టీవీ అయిన సాక్షి పై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆ రోజు తొమ్మిదిన్నర గంటల తర్వాత వైఎస్సార్ కుటుంబంలో విషాదం గుండె పోటుతో వివేకానందా రెడ్డి మృతి అని వారే చెప్పుకోవడం దారుణమని, అలాగే అదే సమయంలో వైసీపీ ఎంపీ ఒకాయన ముందే ఆ ఇంటికి వెళ్ళిపోయి ఇల్లంతా సర్దేసి బాత్రూంలో చనిపోయిన వివేకానంద రెడ్డిని బెడ్ రూమ్ లోకి తీసుకొచ్చి మొత్తం రక్తపు మరకలు కడిగేసి చనిపోయిన దేహానికి వారి ఆస్పత్రి నుంచి వైద్యులను పిలిపించి కుట్లు వేయించి కట్టు కూడా కట్టించారని ఇదెంత దుర్మార్గమని సంచలన వ్యాఖ్యలు చేసారు.
Top