లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో ఎన్టీఆర్ కి మరింత రెస్పెక్ట్ పెరిగిపోయింది..!

Advertisement

by Xappie Desk | March 30, 2019 10:30 IST
Follow Xappie
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో ఎన్టీఆర్ కి మరింత రెస్పెక్ట్ పెరిగిపోయింది..!

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో ఎన్టీఆర్ కి మరింత రెస్పెక్ట్ పెరిగిపోయింది..!
 
టిడిపి పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు రాజకీయ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఒక్క ఆంధ్ర రాష్ట్రం మినహా ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. ఈ సినిమాలో లక్ష్మీపార్వతి ఎన్టీ రామారావు గారి జీవితం లోకి ఎంటర్ అయ్యాక చోటు చేసుకున్న రాజకీయ సంఘటనలు మరియు కుటుంబ సంఘటనలు బయట ప్రపంచానికి తెలియని నికార్సైన నిప్పులాంటి సత్యాలను లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చూపించారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ముఖ్యంగా సొంత ఇంటి వారిచేత మానసికంగా ఒక హైప్లో ఉన్న రాజకీయ నాయకుడు తీవ్ర నిరుత్సాహం లో ఉన్నప్పుడు... ఒక స్త్రీ అతని జీవితంలోకి వచ్చి తిరిగి అతనిని ఏ విధంగా ముందుకు నడిపించింది వంటి లైన్ తీసుకుని ఎక్కడా కూడా ఎవరినీ విమర్శించే విధంగా కాకుండా అద్భుతంగా లక్ష్మీపార్వతి మరియు ఎన్టీఆర్ మధ్య ఉన్న రిలేషన్ ని వెండితెరపై ఆవిష్కరించాడు రాంగోపాల్ వర్మ.
 
మొత్తంమీద చూసుకుంటే ఈ సినిమాలో కేవలం ప్రజల కోసం పాటుపడ్డ రాజకీయ నాయకుడిగా...సొంత ఇంటి వారి చేతనే వెలివేయబడ్డ ఎన్టీఆర్... లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చేత తెలుగు ప్రేక్షకుల హృదయాలను ఎంతగానో దోచుకున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చూశాక అందరూ ఎన్టీఆర్ ని ఆయన సేవా రాజకీయ జీవితాన్ని పొగడ్తల వర్షం తో ముంచెత్తుతున్నారు ప్రేక్షకులు.


Advertisement


Advertisement

Top