Advertisement

నాగబాబు పై షాకింగ్ కామెంట్స్ చేసిన శివాజీ రాజా..!

by Aravind Peesapati | April 08, 2019 18:49 IST
నాగబాబు పై షాకింగ్ కామెంట్స్ చేసిన శివాజీ రాజా..!

నాగబాబు పై షాకింగ్ కామెంట్స్ చేసిన శివాజీ రాజా..!
 
జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం దూసుకెళ్ళిపోతున్నరు నరసాపురం నియోజకవర్గం ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న నాగబాబు. ఇప్పటికే ఆ లోక్సభ స్థానాల పరిధిలో ఉన్న పలు ప్రాంతాలలో తన కూతురు నిహారిక మరియు కొడుకు వరుణ్ తేజ్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నాగబాబు పై సినీ ఇండస్ట్రీ మా అసోసియేషన్ కి సంబంధించిన శివాజీరాజా సంచలన కామెంట్ చేశారు. నాగబాబు వల్ల ‘మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌’ దిగజారిపోయిందని, అభివృద్ధిలో ‘మా’ ను రెండేళ్లు వెనక్కి నెట్టారని ఆయన అన్నారు. మెగా ఫ్యామిలీని తిట్టినవాళ్లకు నాగబాబు రాత్రికి రాత్రే మద్దతు ఇచ్చారని, వాళ్లు ఎన్నికల్లో నెగ్గిన రెండు రోజులకే మెగా ఫ్యామిలీని తిట్టారన్నారు. 600మంది ఉన్న ‘మా’కు ఏమీ చేయనివాడు...నర్సాపురానికి ఏం చేస్తారంటూ శివాజీ రాజా ప్రశ్నించారు. మీరు ఏ పార్టీకి అయినా ఓటు వేసుకోండి...కానీ నాగబాబుకు మాత్రం ఓటు వేయొద్దు అని నర్సాపురం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రపంచంలో తనకు చిరంజీవి తర్వాతే ఎవరైనా అని... తాను ఎప్పుడు చిరంజీవికి పెద్ద అభిమానినే అని శివాజీ రాజా చె్పారు. మెగా కుటుంబంలో నాగబాబే తేడా అని కూడా ఆయన ఎద్దేవ చేశారు.


Advertisement


Advertisement


Top