Advertisement

Advertisement

Advertisement

విప్లవం తీసుకువస్తాం అని అంటున్న వైసీపీ అధినేత జగన్..!

by Xappie Desk | April 09, 2019 12:18 IST
విప్లవం తీసుకువస్తాం అని అంటున్న వైసీపీ అధినేత జగన్..!

విప్లవం తీసుకువస్తాం అని అంటున్న వైసీపీ అధినేత జగన్..!
 
ఎన్నికల ప్రచారంలో చాలా జోరు మీద వున్నారు వైసీపీ పార్టీ అధినేత జగన్. రోజుకి 3 జిల్లాలో పర్యటిస్తున్న 4 మహాసభలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ దూసుకెళ్ళిపోతున్న జగన్ కి అన్ని సర్వేలలో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటికే జాతీయ సర్వేలో జగన్ 2019 ఎన్నికల్లో ఏపీలో అన్ని స్థానాలను క్లీన్స్వీప్ చేయడం ఖాయమని అంటున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జగన్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల గురించి మాట్లాడుతూ రాబోతున్న వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగాలు కల్పించేలా జగన్ అనే నేను ఉద్యోగ విప్లవం తీసుకువస్తున్నట్లు స్పష్టం చేశారు.
 
2014 ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం కల్పిస్తా లేకపోతే ఇంటింటికి నిరుద్యోగ భృతి ఇస్తా అని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నిరుద్యోగులను మోసం చేశారు ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి అని మరొకసారి అధికారం కోసం రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులను ఆకట్టుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ మోసపోవద్దని జగన్ సూచించారు. రాబోయే వైసిపి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగి కి ఉద్యోగం కల్పించేలా అన్ని రకాలుగా బాధ్యత వైసిపి ప్రభుత్వం తీసుకుంటుందని... ముఖ్యంగా పరిశ్రమలు ఎక్కడైతే నెలకొల్పుతారో ఆ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకు 75% లోకల్ రిజర్వేషన్ ఉండేలా చట్టాన్ని మొట్టమొదటి అసెంబ్లీలోనే తీసుకువస్తానని హామీ ఇచ్చారు జగన్. గ్రామాలలో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి అన్ని సంక్షేమ ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన పనులన్నిటినీ ఆ సచివాలయంలో 72 గంటల్లో పరిష్కారమయ్యేలా వ్యవస్థ తీసుకు రాబోతున్నట్లు ఇటువంటి గ్రామ సచివాలయంలో ఆ గ్రామానికి సంబంధించిన నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తున్నట్లు జగన్ పేర్కొన్నారు.


Advertisement


Advertisement

Top