టీడీపీ యాడ్స్ కోసం డైరెక్టర్ బోయపాటి ఎంత తీసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు..?

Written By Aravind Peesapati | Updated: April 11, 2019 10:01 IST
టీడీపీ యాడ్స్ కోసం డైరెక్టర్ బోయపాటి ఎంత తీసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు..?

టీడీపీ యాడ్స్ కోసం డైరెక్టర్ బోయపాటి ఎంత తీసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు..?

 
2019 ఎన్నికలకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు ఆ పార్టీ అధినేత చంద్రబాబు టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి చేతిలో పెట్టారు. గతంలో గోదావరి పుష్కరాల సమయంలో కూడా చంద్రబాబు ఈ విధంగానే ఆ సమయంలో బోయపాటి శ్రీను ని ఇన్వాల్వ్ చేసి పుష్కరాల కార్యక్రమాలు షూట్ చేసేలా చేశారు. అయితే తాజాగా 2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన టిడిపి వాణిజ్య కార్యక్రమాలు ప్రకటనలు మొత్తం అన్నిటిని కవర్ చేసిన డైరెక్టర్ బోయపాటి ఎవరు ఊహించని విధంగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ఏపీ రాజకీయాల్లో వినబడుతున్న టాక్. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. టీడీపీకి సంబంధించిన యాడ్స్ అన్నీ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్ట్ చేశారనే విషయం తెలిసిందే. దాదాపు 10కి పైగానే యాడ్స్ ను, తనదైన ఎమోషనల్ టేకింగ్ తో జనాలకు బాగా కనెక్ట్ అయ్యేలా తన మార్కు చూపించారు బోయపాటి. అయితే ఈ యాడ్స్ కు గానూ దాదాపు 8 నుండి 10 కోట్లు డీల్ కుదుర్చుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ యాడ్స్ ఓటర్లను ఎంత వరకు ప్రభావితం చేశాయో తెలియాలంటే ఎన్నికల రిజల్స్ట్ వరకు ఆగాల్సిందే. మరోపక్క ఎన్నికల ఫలితాలు వచ్చాక డైరెక్టర్ బోయపాటి బాలకృష్ణ ని హీరోగా పెట్టి సినిమా చేయడానికి రెడీ అయినట్లు ఫిల్మ్ నగర్ నుండి వస్తున్న టాక్.
Top