సైకిల్ ని నొక్కితే ఫ్యాన్ తిరుగుతుంది: చంద్రబాబు

Written By Xappie Desk | Updated: April 13, 2019 14:05 IST
సైకిల్ ని నొక్కితే ఫ్యాన్ తిరుగుతుంది: చంద్రబాబు

సైకిల్ ని నొక్కితే ఫ్యాన్ తిరుగుతుంది: చంద్రబాబు
 
మొన్న ఏపీలో పోలింగ్‌ ప్రారంభం అయీ కాకుండానే చంద్రబాబు నిరసన గళం విప్పారు. ఓటింగ్‌ యంత్రాలు దగా చేస్తున్నా యన్నారు. సైకిల్‌ మీట నొక్కితే ఫ్యాను తిరుగు తోందని అలజడి చేశారు. దాదాపు ముప్ఫై శాతం యంత్రాలు పని చేయడం లేదని చెప్పారు.
 
మొత్తం ఈసీ అవతలి వర్గంతో కుమ్మక్కై, మోదీ చేతి కీలుబొమ్మగా పని చేస్తోందని నిరసన వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్నారు. రెండు రోజులు గడిచిపోయినా, ఆఖరికి ప్రశాంతంగా పోలింగ్‌ ప్రక్రియ ముగిసినా చంద్రబాబు పాత పాటే పాడుతున్నారు.
 
చంద్రబాబు భారత రాజ్యాంగ మూలాల గురించి, దేశభక్తి సిద్ధాంతాల గురించి, గాంధేయ వాదంలో నిక్షిప్తమైన నైతిక అంశాల గురించి, తను అవలంభించే మానవతా దృక్పథాల గురించి ప్రతి ప్రెస్‌ మీట్‌ లోనూ మాట్లాడి అందర్నీ బాధిస్తున్నారు.
 
చంద్ర బాబు తన ప్రతి మీటింగ్ లోను ప్రతిపక్షం పై ఏడుస్తూనే ఉన్నారు. ఈ సారి కూడా అలాంటి ఏడుపు తప్ప మరేమీ లేదంటూ ఒక సీనియర్ పాత్రికేయుడు నిట్టూరిస్తూ వెళ్ళాడంట.
Top