గవర్నర్ ని కలిసిన జగన్..!

By Xappie Desk, April 17, 2019 11:02 IST

గవర్నర్ ని కలిసిన జగన్..!

గవర్నర్ ని కలిసిన జగన్..!
 
వైసిపి పార్టీ అధినేత జగన్ ఇటీవల హైదరాబాద్ నగరంలో రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికలు జరిగిన తర్వాత రాష్ట్రంలో జరిగిన ఘటనలు మరియు శాంతిభద్రతల విషయంలో పోలీసులు అనుసరిస్తున్న వైఖరి పట్ల అధికార పార్టీకి చెందిన నేతలు చేస్తున్న అలజడులు పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో వైసీపీ పార్టీ కార్యకర్తలపై నాయకులపై ఎన్నికలు జరిగిన తర్వాత చంద్రబాబు ఆదేశాల మేరకే గొడవలు జరుగుతున్నాయని జగన్ ఆరోపించారు. గురజాల, సత్తెనపల్లి తదితర ప్రాంతాల్లో ఎన్నికల రోజున జరిగిన ఘటనలను గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్లిన జగన్, పోలీసులు కూడా అక్రమంగా తమ పార్టీ కార్యకర్తలపై కేసులు పెడుతూ, టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నరసింహన్ కు వినతిపత్రాన్ని సమర్పించి, తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
 
ఇదే క్రమంలో గవర్నర్తో భేటీ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన జగన్ ...చంద్రబాబు ఈవీఎంల గురించి చేస్తున్న కామెంట్ లపై సెటైర్లు వేశారు. 2014 ఎన్నికల్లో ఇదే చంద్రబాబు ఈవీఎంలపై గెలవలేదా అప్పుడు ఈవీఎంలు బాగా పనిచేశాయి...ఇప్పుడు తాను ఓడిపోతాడని ముందే తెలుసుకుని ఈవీఎంలు కరెక్ట్ కాదని ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 80 శాతం ప్రజలు ఈవీఎంలలో తమ ఓటు హక్కును వినియోగించుకుని సంతృప్తికరంగా ఉంటే..చంద్రబాబుకు మాత్రమే ఈవీఎంల పై డౌట్ రావడం హాస్యాస్పదమని..ఓటమిని అంగీకరించలేక చంద్రబాబు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని జగన్ సెటైర్లు వేశారు.



Top