ఎలక్షన్ సమయంలో ఆపేసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఎట్టకేలకు విడుదల..!

ఎలక్షన్ సమయంలో ఆపేసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఎట్టకేలకు విడుదల..!

ఎలక్షన్ సమయంలో ఆపేసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఎట్టకేలకు విడుదల..!
 
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా పట్ల ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం విడుదల అవకుండా టిడిపి పార్టీ హైకోర్టుకు వెళ్లి ఆపివేయడం జరిగింది. సినిమా వల్ల రాష్ట్రంలో ఉన్న ఓటర్లు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని ఏపీ టీడీపీ నేతలు అప్పట్లో ఈ సినిమా ఆపేశారు.
 
అయితే తాజాగా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల అవటానికి లైన్ క్లియర్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాను మే 1వ తారీఖున విడుదల చేసుకోవచ్చంటూ కోర్టు నిర్మాతలకు అనుమతించింది. ఈ సినిమా అప్పట్లో విడుదలైన ప్రతి చోటా మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఎన్నికలు పూర్తయిన తరువాత ఆంధ్రరాష్ట్రంలో విడుదలవుతున్న ఈ సినిమాపై చాలామంది సినిమా ప్రేక్షకులు రాజకీయ రంగానికి చెందిన కొంతమంది నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.



Top