బాలకృష్ణ కూడా డౌటే..?

బాలకృష్ణ కూడా డౌటే..?

బాలకృష్ణ కూడా డౌటే..?
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రెండో సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీ పార్టీ గెలవడం ఖాయం అని జగనే ముఖ్యమంత్రి అని సర్వే ఫలితాలు చెబుతున్న నేపథ్యంలో ఏపీలో ఉన్న టిడిపి నేతలు మీడియా ముందు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఎన్నికల కమిషన్పై ఈవీఎంలపై ఇలా ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తూ ఓటమిని అంగీకరించలేకపోతున్నారు అంటూ పలువురు సీనియర్ రాజకీయ నేతలు కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు బామ్మర్ది 2014 ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గం నుండి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి తాజాగా రెండోసారి కూడా అదే నియోజకవర్గం నుండి పోటీ చేసిన నేపథ్యంలో బాలకృష్ణ తాజా ఎన్నికల్లో గెలుపోటములపై రకరకాల కామెంట్ వినబడుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గం నుంచి గెలిచిన బాలయ్య బాబు అసలు నియోజకవర్గానికి చెందిన ప్రజలకు అందుబాటులో లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారని అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గ ప్రజలు గతంలో బాలకృష్ణ వ్యవహరించిన తీరుకు భిన్నంగా ఓటు వేసినట్లు ఈ నేపథ్యంలో వైసీపీ పార్టీకి హిందూపురం నియోజకవర్గం ప్రజలు మొగ్గు చూపినట్లు సమాచారం. ఇదే విషయం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో బయట పడడంతో వెంటనే బాలకృష్ణ నియోజకవర్గానికి చెందిన నాయకులు మరియు కార్యకర్తలు తో మీటింగ్ ఏర్పాటు చేసినట్లు...జరిగిన సమావేశంలో కూడా బాలకృష్ణ కు వ్యతిరేకంగా ఫలితాలు మరియు నాయకులు అభిప్రాయాలు వచ్చినట్లు ఒక వార్త ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో బయటకు వచ్చినట్లు టాక్ వినపడుతోంది. దీంతో బాలకృష్ణ గెలుపు కూడా డౌటే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.Top