పవన్ చేసిన పెద్ద తప్పు ఇదే అంటున్న అభిమానులు..?

పవన్ చేసిన పెద్ద తప్పు ఇదే అంటున్న అభిమానులు..?

పవన్ చేసిన పెద్ద తప్పు ఇదే అంటున్న అభిమానులు..?
 
2014 ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవటానికి కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి రెండు చోట్ల నుండి పోటీ చేసి చిత్తు చిత్తుగా ఓడిపోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాలలో కూడా ప్రజలు పవన్ కళ్యాణ్ ని ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఆ రెండు చోట్ల వైసీపీ పార్టీకి పట్టం కట్టారు. ఇటువంటి నేపథ్యంలో పార్టీ దారుణంగా ఓడిపోయిన క్రమంలో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల అభిమానులు షాక్ తిన్నారు. మంగళగిరి రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గత ఎన్నికల అనుభవాలు గురించి కార్యకర్తలకు తెలియజేస్తూ వైసిపి పార్టీ తెలుగుదేశం పార్టీ తన తో పొత్తు పెట్టుకోవడానికి తెగ ఆరాట పడ్డాయని పేర్కొన్నారు. వాళ్లు నాతో పొత్తు పెట్టుకోవడానికి వాళ్ల పార్టీల ఎన్నికల ప్రచారంలో నన్ను తిప్పుకోవటానికి నాకు చాలా అవకాశాలు ఇచ్చారని పవన్ కళ్యాణ్ ఇటీవల ఈ విషయాలు బయటపెట్టారు. దీంతో తాజాగా పవన్ కళ్యాణ్ ఏ ఒక పార్టీతో అయినా పొత్తు పెట్టుకుంటే బాగుండేది అని అనవసరంగా పొత్తు పెట్టుకోకుండా తప్పు చేశారని పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో కూర్చుంటే ఒక ఊపు ఊపే వాళ్ళని జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ వ్యాఖ్యల పట్ల ఈ విధంగా స్పందించారు. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటే కనీసం ఎమ్మెల్యేగా గెలిచి పవన్ కళ్యాణ్ వుండేవారని దీంతో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు అన్న పేరు వచ్చేది కాదని తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యల పట్ల జనసేన కార్యకర్తలు అభిమానులు లబోదిబోమంటున్నారు.



Top