సీమ ను పూర్తిగా విస్మరించిన వై ఎస్ జగన్?

సీమ ను పూర్తిగా విస్మరించిన వై ఎస్ జగన్?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన 2014 మరియు 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీని ఎక్కువగా ఆదరించింది రాయలసీమ ప్రాంత ప్రజలు అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. 2014 ఎన్నికల సమయంలో గోదావరి జిల్లాలో జగన్ కి గట్టిగ దెబ్బ వేయటం తో అధికారం కోల్పోయిన జగన్ 2019 ఎన్నికల్లో అదే గోదావరి జిల్లా ప్రజలు అభిమానులు పొందుకొని మరోపక్క సీమ ప్రాంత ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్న జగన్ ముఖ్యమంత్రి అయ్యారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన జగన్ తాజాగా తనని ఆదరించిన రాయలసీమ ప్రాంతాన్ని విస్మరించినట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఎందుకంటే శ్రీశైలం జలాశయం శరవేగంగా నిండుతోంది. ఇప్పటికి 855 అడుగుల వరకూ చేరుకుంది. మామూలుగా… 840 అడుగులకు చేరగానే.. పోతిరెడ్డి పాడు నుంచి రాయలసీమకు నీరు తరలించడం ప్రారంభిస్తారు. కానీ తెలంగాణ అధికారులు పంపులు ఆన్‌ చేయవలసిన సమయం వచ్చిన రాయలసీమ ప్రాంతానికి నీరు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైన ఏమి పట్టించుకోవడం లేదు. ఏమైనా అంటుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అనుమతి రాలేదని చెబుతున్నారు. 840 అడుగుల దగ్గర్నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా నీరు మళ్లించి బానకచర్ల క్రాస్‌రెగ్యులేటర్‌ నుంచి కేసీ కాలువ, ఎస్సార్బీసీ, తెలుగుగంగ ద్వారా సాగు, తాగునీరు సీమ జిల్లాలకు అందిస్తారు. ఈ నీటిని సీమ మొత్తం అందించడానికి.. హంద్రీనీవా సుజల స్రవంతి, మాల్యాల ప్రధాన లిఫ్టు, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం రెడీగా ఉన్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం నీటిని వదిలి పెట్టేందుకు ఆదేశాలు ఇవ్వడం లేదు అన్నట్టుగా తెలంగాణ అధికారులు కామెంట్లు చేస్తున్నట్లు సమాచారం. మరి ఇటువంటి సమయంలో స్పందించాల్సిన జగన్ ఏమే మాట్లాడకపోవడంపై రాయలసీమ ప్రాంత ప్రజల్లో జగన్ తీరుపై విమర్శలు వస్తున్నాయి.



Top