జగన్ ఆవేశం తగ్గించుకోవాలి అంటున్న ఏపీ బీజేపీ నేత..!

జగన్ ఆవేశం తగ్గించుకోవాలి అంటున్న ఏపీ బీజేపీ నేత..!

జగన్ ఆవేశం తగ్గించుకోవాలి అంటున్న ఏపీ బీజేపీ నేత..!

 
ఏపీ సీఎం జగన్ తనకు బంపర్ మెజారిటీ ఇచ్చిన ఆంధ్ర ప్రజలకు అవినీతి లేని ప్రభుత్వం ఇవ్వటానికి అన్ని విధాలా కృషి చేస్తున్నారు. ముందు నుండి ప్రభుత్వ అధికారులను తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను, ఎంపీలను జగన్ తాను ప్రజలతో ఏవిధంగా ఉండాలో ఏ విధమైన పరిపాలన అందించాలి అనుకుంటున్నాడో మీటింగ్లు పెట్టి మరీ చెప్పారు. ఇప్పుడు అదే క్రమంలో రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగాన్ని తగ్గిస్తూ ఉద్యోగాలు లేక ఖాళీగా ఉన్న యువతకు గ్రామ వాలంటీర్ల పేరిట ఉద్యోగాలు సృష్టిస్తూ ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారిని వారధిగా వాడుకోవడానికి రెడీ అయిన సంగతి మనకందరికీ తెలిసినదే. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఏపీ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ జగన్ పై సంచలన కామెంట్లు చేశారు. జగన్ ఆవేశం తగ్గించుకోవాలని సూచించారు. అంతేకాకుండా ఆలోచనతో వ్యవహరించి ప్రభుత్వాన్ని నడిపించే పోవాలని పేర్కొన్నారు. ముఖ్యంగా వలంటీర్ల వ్యవస్థ జన్మభూమి కమిటీలకు ప్రతిరూపమేనని ఆయన అబిప్రాయపడ్డారు. వైసీపీ తీసుకునే ప్రజా వ్యతిరేక చర్యలను విమర్శిస్తాం. వారికి ప్రత్యామ్నాయం బీజేపీ ఒక్కటనని కన్నా జోస్యం చెప్పారు. . ఏపీలో బీజేపీ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోదని పేర్కొన్నారు. తమతో పొత్తు వల్ల టీడీపీ లాభపడిందని, తాము తీవ్రంగా నష్టపోయామని కన్నా చెప్పారు.Top