క్రిస్టియానో రోనాల్డో నన్ను రేప్ చేశాడు అంటున్న మోడల్..!

Advertisement

by Aravind Peesapati | August 21, 2019 12:45 IST
Follow Xappie
క్రిస్టియానో రోనాల్డో నన్ను రేప్ చేశాడు అంటున్న మోడల్..!

క్రిస్టియానో రోనాల్డో నన్ను రేప్ చేశాడు అంటున్న మోడల్..!

 
ప్రపంచ క్రీడారంగంలో అత్యధిక డబ్బులు సంపాదించే ఫుట్ బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో పై అత్యాచారం ఆరోపణలు వచ్చాయి. అమెరికా దేశానికి చెందిన ఓ మోడల్ రొనాల్డోపై అత్యాచార ఆరోపణలు చేయడం జరిగింది. 10 సంవత్సరాల క్రితం తనను రొనాల్డో తనపై అత్యాచారం చేశాడని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఆ పిటిషన్ పై విచారణ సాగుతోంది. ఈ విషయం గురించి గత కొన్ని రోజుల నుండి అనేక వార్తలు అంతర్జాతీయ మీడియా రంగంలో కథలు కథలుగా కథనాలు వస్తున్నాయి. మయోర్గా అనే ఆ మోడల్ కు అప్పట్లోనే రొనాల్డో భారీగా డబ్బులు ఇచ్చి వ్యవహారాన్ని సెటిల్ చేసుకున్నాడనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఆ విషయాన్ని రొనాల్డో ఖండిస్తూ వచ్చాడు. అయితే తాజాగా రొనాల్డో లాయర్లు ఆ విషయాన్ని ధ్రువీకరించారు. ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.2.75 కోట్లను రొనాల్డో సదరు మోడల్ కి చెల్లించి ఆమెతో వ్యవహారాన్ని సెటిల్ చేసుకున్నాడని.. అయితే అది నేరాన్ని ఒప్పుకోవడం కాదని అంటున్నారు. ఎందుకంటే అప్పటికే క్రిస్టియానో రోనాల్డో ఒక సెలబ్రిటీగా ప్రపంచంలో ఎదుగుతున్న సమయంలో సదరు మోడల్ నోరెత్తకుండా చేయటానికి ఆమెకు డబ్బులు ఇవ్వడం జరిగింది లాయర్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇప్పుడు అంత డబ్బు తీసుకుని కూడా ఆమె మళ్ళీ మాట్లాడటం సిగ్గుచేటు అంటూ లాయర్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ విషయమై క్రిస్టియానో రోనాల్డో అంతర్జాతీయ స్థాయిలో విమర్శలతో పాటు ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాడు.


Advertisement


Advertisement

Top