30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి పై సినీనటుడు రాజేంద్ర ప్రసాద్ షాకింగ్ కామెంట్స్..!

30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి పై సినీనటుడు రాజేంద్ర ప్రసాద్ షాకింగ్ కామెంట్స్..!

30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి పై సినీనటుడు రాజేంద్ర ప్రసాద్ షాకింగ్ కామెంట్స్..!
 
వైసిపి పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్ కి ముందు నుండి టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి మద్దతుగా ఉన్న 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి పై కమెడియన్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రి అవడం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలకు ఇష్టం లేదని షాకింగ్ కామెంట్ చేశారు. దీంతో పృద్వి చేసిన వ్యాఖ్యలపై రాజేంద్రప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. ఇటీవల తిరుమల తిరుపతి దర్శించుకున్న రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ పృద్వి వ్యాఖ్యలపై ఈ విధంగా స్పందించారు. సీఎం అవగానే వెంటనే వెళ్లి కలవడానికి సినీ నటులు వ్యాపారవేత్తలు కాదని అన్నారు. కళాకారులు సీఎంను కలవాలనే నిబంధన ఏమీ లేదని రాజేంద్రప్రసాద్ అన్నారు. జగన్ సీఎంగా సెటిల్‌ అయిన తర్వాత కలుస్తామని రాజేంద్రప్రసాద్ తెలిపారు. సీఎం అవగానే వెళ్లి ఆయనను కలవడం ఎందుకని ప్రశ్నించారు. జగన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరూ సినీ పరిశ్రమ పట్ల సానుకూలంగా ఉన్నాట్లు రాజేంద్రప్రసాద్ చెప్పారు. ప్రజలకు తాగునీరందించే సీఎం తమకు దేవుడని, అలాగే సీఎం జగన్‌ను రేపు కలవాల్సి ఉండిందని, ఇతరత్రా కారణాలతో రెండుమూడు రోజుల్లో కలిసేందుకు ఆయన అవకాశం ఇచ్చినట్లు రాజేంద్రప్రసాద్ చెప్పారు.Top