హౌస్ లో బోరున విలపించిన శివ జ్యోతి..!

Advertisement

by Aravind Peesapati | August 19, 2019 14:08 IST
Follow Xappie
హౌస్ లో బోరున విలపించిన శివ జ్యోతి..!

హౌస్ లో బోరున విలపించిన శివ జ్యోతి..!

 
బిగ్ బాస్ సీజన్ 3 ఆదివారం జరిగిన ఎపిసోడ్ తో నాలుగు వారాలు పూర్తి చేసుకున్న ఐదవ వారంలో కి వెళ్ళింది. ఇటువంటి క్రమంలో ఆదివారం జరిగిన ఎలిమినేషన్ ఎపిసోడ్ లో ఎలిమినేషన్ కార్యక్రమం చాలా ఆసక్తికరంగా మారింది. ఇంటి నుండి హేమ మొట్టమొదటి సభ్యురాలు ఎలిమినేట్ అవ్వగా ఆ సమయంలో వైల్డ్ కార్డు రూపంలో తమన్నా సింహాద్రి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ తర్వాత రెండో వారంలో జాఫర్ ఎలిమినేట్ అయ్యాడు మూడవ వారంలో తమన్నా ఎలిమినేట్ కాగా తాజాగా నాలుగో వారంలో ఏడుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు.ఈ ఏడుగురులో శివజ్యోతి, వరుణ్ సేవ్ అయినట్లుగా శనివారం నాటి ఎపిసోడ్ లో నాగార్జున వెల్లడించారు. బాబా భాస్కర్‌, శ్రీముఖి, రవికృష్ణ, రాహుల్‌, రోహిణిలోంచి ఎవరు ఎలిమినేట్‌ కాబోతున్నారో విషయంపై ఇప్పటికే లీకులు వచ్చాయి. అందరూ ఊహించిన విధంగానే రోహిణి ఎలిమినేట్ అయినట్లుగా నాగార్జున అనౌన్స్ చేశారు. నాగార్జున.. రోహిణి పేరు చెప్పిన వెంటనే శివజ్యోతి ఎమోషనల్ అయింది. హౌస్ లో రోహిణి, శివజ్యోతిలు ఎంతో సన్నిహితంగా మెలిగారు. దీంతో రోహిణి ఎలిమినేట్ అయిందని తెలిసిన వెంటనే శివజ్యోతి వెక్కి వెక్కి బోరున ఏడ్చేసింది.


Advertisement


Advertisement

Top