Advertisement

Advertisement

Advertisement

హౌస్ లో ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో ఆ ఇద్దరి నీ టార్గెట్ చేసిన ఇంటి సభ్యులు..!

by Aravind Peesapati | August 20, 2019 13:16 IST
హౌస్ లో ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో ఆ ఇద్దరి నీ టార్గెట్ చేసిన ఇంటి సభ్యులు..!

హౌస్ లో ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో ఆ ఇద్దరి నీ టార్గెట్ చేసిన ఇంటి సభ్యులు..!

 
బిగ్ బాస్ సీజన్3 చాలా ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ఇటీవల ఐదవ వారంలో కి అడుగుపెట్టిన నేపథ్యంలో హౌస్ లో ఉన్న ఇంటి సభ్యులు ఒక్కొక్కరు తమ ఒరిజినల్ క్యారెక్టర్ బయట పెట్టేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో ఇంటి సభ్యులు అంతా ఎక్కువగా రాహుల్ ని మరియు హిమజా ని టార్గెట్ చేసినట్లు అర్థమవుతుంది. ఈ ప్రక్రియలో భాగంగా కెప్టెన్ అయిన ఆలీకి ఎలిమినేషన్ నామినేషన్ నుండి మినహాయింపు జరిగింది. అంతేకాకుండా బిగ్ బాస్ కెప్టెన్ ఆలీ నలుగురిని ఎలిమినేషన్ కి నామినేట్ చేయమని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా అలీ బాబా భాస్కర్, రాహుల్, హిమజ, వితికా పేర్లన సూచించారు. అలీ మనసుని మార్చి నామినేషన్స్ నుండి బయటపడటానికి ప్రయత్నించారు బాబా భాస్కర్. హిమజ-అలీలా మధ్య మళ్లీ కాసేపు చర్చ నడిచింది. తనను ఎందుకు నామినేట్ చేశావో అర్ధం కావడం లేదని హిమజ అడగడంతో నీకు అర్ధం కాదులే లైట్ తీసుకో అని చెప్పాడు. మొదటిగా పునర్నవి.. హిమజ, రాహుల్‌ని నామినేట్ చేసింది. రాహుల్‌ని నామినేట్ చేస్తూ.. అతను గేమ్‌ని సీరియస్ తీసుకోవడం లేదని నాకు బిగ్ బాస్ కాకపోతే ఇంకో లైఫ్ ఉందని అనుకుంటున్నాడని కారణం చెప్పింది. హిమజని నామినేట్ చేస్తూ.. ఆమె ఎప్పుడూ నేను చేసిందే కరెక్ట్ అని వాదిస్తోంది అంటూ చెప్పుకొచ్చింది. మొత్తంమీద చూసుకుంటే హౌస్ లో ఉన్న సభ్యులు ఎక్కువగా రాహుల్ మరియు హిమజా ని టార్గెట్ చేసినట్టు అర్థం అవుతుంది.


Advertisement


Advertisement

Top