Bigg Boss Telugu: బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున ఎందుకు అతడిని వదిలేశారు ఇదే ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్..?

Advertisement

by Aravind Peesapati | July 28, 2019 16:46 IST
Follow Xappie
Bigg Boss Telugu: బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున ఎందుకు అతడిని వదిలేశారు ఇదే ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్..?

బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున ఎందుకు అతడిని వదిలేశారు ఇదే ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్..?
 
వరుస వివాదాలు మరోపక్క సమావేశాలు ఇంకోపక్క క్షమాపణలు ఇది ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో జరుగుతుంది. అన్నం తినే చోట ఇంకా ఎక్కడ పడితే అక్కడ ఎవరికి వారు పెర్ఫార్మెన్స్ అదిరిపోయే రీతిలో చేస్తున్నారు మరోపక్క టీవీ9 యాంకర్ జాఫర్ అంతా గమనిస్తూ చాలా సైలెంట్ గా ఒక పక్క కూర్చుంటున్నారు. ఇదిలా ఉండగా తాజాగా బిగ్ బాస్ హౌస్ లో అద్భుతం గా రాణిస్తున్న కంటెస్టెంట్ యూట్యూబ్ ఛానల్ లో మంచి క్రేజ్ దక్కించుకున్న మహేష్ విట్టా జంటగా వచ్చిన వరుణ్ సందేశ్ ఆయన భార్య వితిక తో హౌస్ లో జరిగిన గొడవ సంచలనం సృష్టించింది. తన భార్యతో మహేష్ మర్యాద లేకుండా ప్రవర్తించడం వరుణ్ సందేశ్ మహేష్ తో గొడవ కి దిగడంతో...ఆ సమయంలో మహేష్ ఆ జంటకు సారి చెప్పడం జరిగింది. కాగా శనివారం ఎపిసోడ్ లో నాగార్జున దాదాపుగా అందరిని టచ్ చేశారు. మహేష్ ని కర్రోడా అన్నందుకు రవికృష్ణకు, ఓవర్ యాక్షన్ చేస్తున్న హేమకు వార్నింగ్ ఇచ్చాడు. మంచి పేరు తెచ్చుకుంటున్న పునర్నవి, హిమజ లని ప్రశంసించాడు. బిగ్ బాస్ హౌస్ లో ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత స్నేహితులుగా మారిపోయిన జాఫర్, బాబా భాస్కర్ ని కూడా నాగ్ ప్రశంసించాడు. అయితే వరుణ్ మరియు వితిక తో మహేష్ కు జరిగిన గొడవ గురించి నాగార్జున ప్రస్తావించకపోవడంతో...చాలామంది లాస్ట్ ఎపిసోడ్ చూసిన ప్రేక్షకులు ఎందుకు నాగార్జున గారు ఈ విషయం లేవనెత్తలేదని తెగ చర్చించుకుంటున్నారు. మరోపక్క మాత్రం ఖచ్చితంగా మహేష్ కి నాగార్జున వార్నింగ్ ఇస్తారని మరి కొంతమంది అంటున్నారు.


Advertisement


Advertisement

Top