Bigg Boss Telugu S03: బిగ్ బాస్ లో అందరికంటే ఎక్కువ సంపాదిస్తుంది ఎవరో తెలుసా?

Advertisement

by Aravind Peesapati | July 31, 2019 13:33 IST
Follow Xappie
Bigg Boss Telugu S03: బిగ్ బాస్ లో అందరికంటే ఎక్కువ సంపాదిస్తుంది ఎవరో తెలుసా?

బిగ్ బాస్ లో అందరికంటే ఎక్కువ సంపాదిస్తుంది ఎవరో తెలుసా ?
 
ప్రస్తుతం తెలుగు టెలివిజన్ రంగంలో ప్రేక్షకులను అలరిస్తున్న రియాల్టీ షో బిగ్ బాస్. తాజాగా ప్రసారమవుతున్న సీజన్ త్రీ లో ఇప్పటికే సీనియర్ నటి హేమ మొట్టమొదటి కంటెస్టెంట్ సభ్యురాలిగా ఇంటి నుండి ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసినదే. ఈమె ప్లేస్ లో వైల్డ్ కార్డ్ రూపంలో తమన్నా సింహాద్రి ఎంట్రీ ఇచ్చింది. దాదాపు 15 మంది ఇంటి సభ్యులు వంద రోజులు హౌస్ లో ఉంటున్న క్రమంలో బిగ్ బాస్ హౌస్ లో అందరికంటే ఎక్కువ సంపాదిస్తున్నది ఎవరు అన్న దాని గురించి తాజాగా ఒక వార్త బయటకు వచ్చింది. ముఖ్యంగా షో నిర్వాహకులు రెండో సీజన్లో చాలామంది సామాన్యులను తీసుకోవడంతో పెద్దగా అభిమానులు బిగ్ బాస్ 2 పై ఆసక్తి చూపకపోవడంతో మూడవ సీజన్ లో అందరిని సెలబ్రిటీల నే తీసుకున్నారు. ఎంత మంది సెలబ్రిటీలు ఉన్న హౌస్ లో ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ శ్రీముఖి అని ఇటీవల బయటపడింది. ఆమె బిగ్ బాస్ షో కోసం 100 రోజులు డేట్స్ ఇచ్చింది. ఇందుకుగాను ఆమెకి దాదాపు “మూడున్నర కోట్లు” రెమ్యూనరేషన్ ఇచ్చారని తెలుస్తుంది. ఒక సినిమాకి హీరోయిన్ అన్ని కాల్షీట్స్ ఇస్తే ఆమెకి 75 లక్షల నుండి కోటి మధ్యలో ఇస్తారు. కొంచం స్టార్ హీరోయిన్స్ అయితే 2 కోట్లు వరకు ఇస్తారు, కానీ శ్రీముఖికి మాత్రం మూడున్నర కోట్లు ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Advertisement


Advertisement

Top