Bigg Boss Telugu S03: బిగ్ బాస్ హౌస్ నుండి హేమ ఎలిమినేషన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన పరుచూరి బ్రదర్స్..!

Advertisement

by Aravind Peesapati | August 07, 2019 15:08 IST
Follow Xappie
Bigg Boss Telugu S03: బిగ్ బాస్ హౌస్ నుండి హేమ ఎలిమినేషన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన పరుచూరి బ్రదర్స్..!

Bigg Boss Telugu S03: బిగ్ బాస్ హౌస్ నుండి హేమ ఎలిమినేషన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన పరుచూరి బ్రదర్స్..!
 
బిగ్ బాస్ మూడవ సీజన్ మొట్టమొదటి ఎలిమినేట్ అయిన హౌస్ కంటెస్టెంట్ నటి హేమ ఎలిమినేషన్ పై పరుచూరి బ్రదర్స్ షాకింగ్ కామెంట్ చేశారు.పరుచూరి పలుకులు పేరుతో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలను విశ్లేషిస్తూ చేస్తున్న కార్యక్రమంలో బిగ్ బాస్ కార్యక్రమం పై తనదైన శైలిలో స్పందించారు.అప్పుడప్పుడూ ఇతర అంశాలని కూడా ప్రస్తావిస్తుంటారు. బిగ్ బాస్ గురించి మాట్లాడుతూ.. హేమ నాకు 14 ఏళ్ల చిన్న అమ్మాయి వయసు నుంచి తెలుసు. ఆమె రూపం చూసి హీరోయిన్ అవుతుందనుకున్నా. హీరోయిన్ కాలేకపోయినా అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయింది. పలు సందర్భాల్లో మహిళల కోసం మీడియాని సైతం ఎదిరించింది.
 
దీనితో తనకు హేమపై గౌరవం పెరిగిందని పరుచూరి అన్నారు. అలాంటి హేమ బిగ్ బాస్ షోకు వెళ్లి తొలి వారమే ఎలిమినేట్ కావడం బాధించింది అని పరుచూరి అన్నారు. బిగ్ బాస్ షో రూల్స్ ఎలాగైనా ఉండొచ్చు.. కానీ తొలి వారమే ఎలిమినేషన్ లేకపోతే బావుంటుంది. ఇంటి సభ్యులని ఒకరిని ఒకరు అర్థం చేసుకునేందుకు కనీసం రెండు వారాల సమయం అయినా ఇవ్వాలి. కేవలం ఆడియన్స్ వేసిన ఓట్లు తప్ప హేమని ఎలిమినేట్ చేయడానికి ఎలాంటి కారణం లేదు. అలా కాకుండా తొలి వారంలో కెప్టెన్ అయ్యేందుకు ఇంటి సభ్యుల మధ్య పోటీ నిర్వహించాల్సింది అని పరుచూరి అభిప్రాయపడ్డారు.
 


Advertisement


Advertisement

Top