Bigg Boss Telugu Season 3 - పునర్నవి కి డేట్ ఆఫర్ ఇచ్చిన రాహుల్.... మండిపడ్డ పునర్నవి..?
మూడవ సీజన్ బిగ్ బాస్ రియాల్టీ షో ప్రేక్షకులను మైమరిపిస్తుంది. ప్రస్తుతం ఇంటిలో హౌస్ కెప్టెన్ గా వరుణ్ సందేశ్ ఎంపికవడంతో హౌస్ లో వాతావరణం కొత్త గా మారింది. ఎవరి స్ట్రాటజీలు తో వారు బయట పడి పోతూ గ్రూపు రాజకీయాలు టైపు ఒక్కొక్కరు ఒక్కో విధంగా కొత్త కొత్త గ్రూపులు కడుతున్నారు హౌస్ లో. అయితే తాజాగా జరిగిన ఎపిసోడ్ లో పునర్నవి కి డేట్ ఆఫర్ రాహుల్ ఇవ్వటం తో మండిపడ్డ పునర్ రవి.. ఎపిసోడ్ కె హైలెట్ గా నిలిచింది. అసలు వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏంటంటే హౌస్ ఇంటి సభ్యులు అంతా వంటగదిలో ఉన్న సమయంలో...రాహుల్ సిప్లిగంజ్ పునర్నివిని డేట్ చేద్దమని అడుగుతాడు. అయితే దానికి పునర్నవి అసలు నువ్వు నా రిలేషన్‌షిప్ గురుంచి అడిగావా అంటూ ప్రశ్నిస్తుంది. దానికి వెంటనే రాహుల్ నువ్వు రిలేషన్‌షిప్‌లో ఉన్నావా అని అడగగా పునర్నవి వెంటనే అవును అని చెబుతుంది. రాహుల్ కాస్త బాదపడుతూ ఎవరు ఆ అందగాడు అని అడగగా నేను చెప్పను అంటూ బదులిచ్చింది. అయిన కూడా రాహుల్ ఆగకుండా మరీ నా పరిస్థితి ఎలా అని అడగగా రాహుల్ నాటకాలు ఆడకు అని వార్నింగ్ ఇచ్చింది. అయితే వీరి సంభాషణలో పక్కనే వరణ్‌సందేశ్ కూడా కూర్చుని వీరిద్దరి సంభాషణ విని తెగ పగలబడి నవ్వుతాడు. కానీ రాహుల్ మాత్రం పునర్నవి నో చెప్పటంతో బిక్క మొహం వేసుకుని కూర్చుంటాడు.