Bigg Boss Telugu Season 3: హౌస్ లో అతి చేస్తున్న అందంతో ఓట్లు కొల్లగొడుతున్న బిగ్ బాస్ హాట్ ముద్దుగుమ్మ..!

Advertisement

by Aravind Peesapati | August 07, 2019 15:12 IST
Follow Xappie
Bigg Boss Telugu Season 3: హౌస్ లో అతి చేస్తున్న అందంతో ఓట్లు కొల్లగొడుతున్న బిగ్ బాస్ హాట్ ముద్దుగుమ్మ..!

హౌస్ లో అతి చేస్తున్న అందంతో ఓట్లు కొల్లగొడుతున్న బిగ్ బాస్ హాట్ ముద్దుగుమ్మ..!
 
బిగ్ బాస్ హౌస్ లో ముందునుండి పునర్నవి చాలా సైలెంట్ గా ఉంటూ హౌస్ ఇంటి సభ్యులు అంతా తాను ఎవరితో కలవడం లేదని చెబుతున్న క్రమంలో తనని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మలుచుకుంటూ హౌస్ లో రచ్చ రచ్చ చేస్తుంది చాలా సైలెంట్ మైండ్ గేమ్ ఆడుతోంది పునర్నవి. హౌస్ లో చాలా మొండిగా వ్యవహరిస్తో తాజాగా జరిగిన ఎలిమినేషన్ కార్యక్రమంలో హౌస్ లో ఉన్న ఇంటి సభ్యులందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న వాతావరణం గమనిస్తే హిమజ, శివజ్యోతి, రోహిణి ఎప్పటిలానే కొనసాగుతున్నారు. బాబా భాస్కర్ కు క్రేజ్ పెరుతుతోంది.
 
ఇదిలా ఉండగా సోమవారం జరిగిన ఎపిసోడ్ లో పునర్నవి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. బాబా భాస్కర్, హిమజ, రోహిణి, మహేష్ లు పునర్నవిని నామినేట్ చేశారు. నామినేషన్ లో ప్రతి వారం ఎవరో ఒకరు ఉండాల్సిందే. బిగ్ బాస్ అనేది గేమ్. ఆ విషయం మరచిపోయి తొలి వారం నుంచి తనని టార్గెట్ చేస్తున్నారని పునర్నవి ఎమోషనల్ అయిపోయింది.
 
బాబా భాస్కర్ మీరేమి హీరో కాదు.. అందరిలాగే ఓ కంటెస్టెంట్ అని మాట్లాడింది. కోపంతో పునర్నవి తాను ఎవరిని నామినేట్ చేయడం లేదని, తనని తానే నామినేట్ చేసుకుంటున్నాని బిగ్ బాస్ కు తెలిపింది.పెద్ద సీన్ జరిగాక వరుణ్ బతిమాలితే దిగొచ్చింది. ఇంత అతి చేస్తున్నా పునర్నవిపై ప్రేక్షకుల్లో వ్యతిరేకత లేదు. ఆమె బ్యూటీకి ఫిదా అవుతున్న ప్రేక్షకులు గంపగుత్తగా ఓట్లు గుద్దేస్తున్నారు. ఈ లెక్కన పునర్నవి ఈ వారం కూడా ఎలిమినేషన్ నుంచి బయటపడడం పెద్ద కష్టమేమి కాదు. ఇదే బిహేవియర్ కొనసాగిస్తే మాత్రం ఎదో ఒక సమయంలో పునర్నవిపై ఆడియన్స్ లో వ్యతిరేకత పెరగడం ఖాయం. బాబా భాస్కర్, పునర్నవి, రాహుల్, వితిక, తమన్నా ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు.


Advertisement


Advertisement

Top