Bigg Boss Telugu Season 3: బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియలో శివ జ్యోతి, రోహిణి కి ఊహించని షాక్ఇచ్చిన బిగ్ బాస్..!

Advertisement

by Aravind Peesapati | August 13, 2019 14:14 IST
Follow Xappie
Bigg Boss Telugu Season 3: బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియలో శివ జ్యోతి, రోహిణి కి ఊహించని షాక్ఇచ్చిన బిగ్ బాస్..!

Bigg Boss Telugu Season 3 Episode 23 Highlights: బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియలో శివ జ్యోతి, రోహిణి కి ఊహించని షాక్ఇచ్చిన బిగ్ బాస్..!

 
నాలుగో వారంలో కి అడుగుపెట్టిన బిగ్ బాస్ సీజన్ 3 నామినేషన్ కార్యక్రమంలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవల సోమవారం జరిగిన ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ చాలా డిఫరెంట్ గా జరిగింది. ఈ సందర్భంగా బిగ్ బాస్ ఇంటి సభ్యులని కన్ఫెషన్ రూమ్ లోకి ఇద్దరు ఇద్దరిని గా పిలిచారు. మీలో ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు అని చాలా డిఫరెంట్గా ప్రశ్నించారు. ముందుగా రవి, వితికా జంటగా వెళ్లగా.. రవి నామినేట్ అయి వితికాని సేఫ్ చేశాడు. రోహిణి, శివ జ్యోతిని జంటగా పిలిచారు బిగ్ బాస్. వారిద్దరు ఒక అండర్‌స్టాడింగ్‌తో శివజ్యోతి నామినేట్ కాగా.. రోహిణి సేఫ్ అయింది. ఫైనల్ గా నామినేషన్ ప్రక్రియ ముగిసే నాటికి రాహుల్, శివజ్యోతి, శ్రీముఖి, రవి, రోహిణి, వరుణ్, బాబా భాస్కర్‌లు నాలుగో వారం ఎలిమినేషన్ జోన్‌లో ఉన్నారు. ఈ ఏడుగురులో ఒకరు ఈవారం ఎలిమినేట్ కాబోతున్నారు. నామినేషన్స్‌ గురించి ఒకరితో ఒకరి సంభాషించకూడదని బిగ్ బాస్ పదే పదే హెచ్చరిస్తున్నా.. శివజ్యోతి, రోహిణిలు పట్టించుకోకుండా గుసగుసలాడటంతో బిగ్ బాస్ హెచ్చరిస్తూ శివజ్యోతి నాలుగోవారం ఇప్పటికే నామినేట్ కావడంతో రోహిణిని డైరెక్ట్‌గా నామినేట్ చేశారు. ఈవారానికి కాకుండా.. వచ్చే వారానికి కూడా ఇద్దర్నీ డైరెక్ట్‌గా నామినేట్ చేసి ఊహించని షాక్ ఇచ్చారు.


Advertisement


Advertisement

Top