జూనియర్ ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన పోసాని కృష్ణ మురళి..!

జూనియర్ ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన పోసాని కృష్ణ మురళి..!

జూనియర్ ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన పోసాని కృష్ణ మురళి..!
 
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగితే గానీ టిడిపి పార్టీ తిరిగి పుంజుకుంటుందని సోషల్ మీడియాలో ఇంకా అనేక చోట్ల వార్తలు వినబడుతున్నాయి. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో గల్లంతయిన టిడిపి ఆంధ్రాలో మనుగడ సాధించాలంటే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ లోకి రావాలని చాలా మంది టిడిపి కార్యకర్తలు నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు.
 
ఇటువంటి తరుణంలో కార్యక్రమాన్ని మీడియాతో మాట్లాడుతూ...జూనియర్ ఎన్టీఆర్ చేతిలోకి టీడీపీ పగ్గాలు వెళ్లినా ఉపయోగం లేదని అన్నారు. అంతేకాదు జగన్మోహన్ రెడ్డిగారి పరిపాలన బాగోలేనప్పుడు, అంతా అవినీతిమయమైపోయినప్పుడు మాత్రమే ఇక్కడ సీనియర్ ఎన్టీఆర్ కైనా, జూనియర్ ఎన్టీఆర్ కైనా ఒక ప్లేస్ ఉంటుంది కానీ జగన్ ఇక ఎవరికి ఆ అవకాశం ఇవ్వరని తేల్చి చెప్పారు. రాజకీయాలు వేరు, సినిమాలు వేరని ఎవరు, ఎప్పుడు, ఎందుకు రాజకీయాల్లోకి వస్తున్నారో కనిపెట్టలేనంత అమాయకంగా ప్రజలు లేరని పోసాని చెప్పుకొచ్చారు.Top