సమంతా టైమింగ్ అంతా బ్యాడ్ గా ఉందా

Advertisement

by Siddhu Manchikanti | July 08, 2019 11:01 IST
Follow Xappie
సమంతా టైమింగ్ అంతా బ్యాడ్ గా ఉందా

సమంతా టైమింగ్ అంతా బ్యాడ్ గా ఉందా
 
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో సమంత టైమింగ్ అద్భుతం గా నడుస్తోంది. ఈ ఏడాది విడుదలైన రెండు సినిమాలు మజిలీ, ఓ బేబీ సూపర్ డూపర్ హిట్ అవడంతో మంచి జోష్ మీద ఉంది సమంత. అయితే తాజాగా విడుదలైన ‘ఓ బేబీ’ సినిమా అద్భుతమైన కలెక్షన్లతో బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు సృష్టిస్తోంది. ఇటువంటి క్రమంలో వేసవి కాలం సెలవులు అయిపోయాక...స్కూళ్లు కాలేజీలు ఓపెన్ చేశాక ఈ సినిమా రిలీజ్ చేయటం సమంత బ్యాడ్ టైమింగ్ అని ఇండస్ట్రీకి చెందిన కొంతమంది అంటున్నారు.
 
సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యి ఉంటే కచ్చితంగా ప్రస్తుతం వస్తున్న కలెక్షన్ల కంటే నాలుగు రెట్లు వచ్చేవి అన్నికామెంట్ చేస్తున్నారు. ఈ సమ్మర్ కి కేవలం మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా మాత్రమే సూపర్ డూపర్ హిట్ అయింది..విడుదలైన చాలా సినిమాలు ప్రేక్షకులను అలరించలేకపోయాయి..మరి ఇటువంటి క్రమంలో ఇంత మంచి సినిమా ఓ బేబీ సినిమా విడుదల చేయకపోవడం కచ్చితంగా సమంత బ్యాడ్ టైమింగ్ అని...ఎంతో అనుభవం ఉన్న అన్ని నిర్మాత సురేష్ బాబు కూడా ఈ వేసవి ని మిస్సయ్యారు అని అంటున్నారు.


Advertisement


Advertisement

Top