ఆ ప్రముఖ ఛానల్ ని కొనడం కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు?

ఆ ప్రముఖ ఛానల్ ని కొనడం కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు?

ఆ ప్రముఖ ఛానల్ ని కొనడం కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు?
 
వైసిపి పార్టీ అధినేత జగన్ కి సొంత మీడియా.. చానల్ సాక్షి ఉందని అందరికీ తెలిసిన విషయమే. తన తండ్రి వైయస్ హయాంలోనే సాక్షి మీడియా ని ప్రవేశపెట్టి తన కుటుంబానికి మరియు తన తండ్రి పరిపాలనకు వ్యతిరేకంగా రాస్తున్న మీడియా ఛానల్ కు సాక్షి ఛానల్ ద్వారా ప్రజలకు క్లారిటీ ఇచ్చే వారు. అయితే తన తండ్రి చనిపోయిన తర్వాత ఓ వర్గం మీడియా తనపై దారుణమైన వ్రాతలు కథనాలు రాసిన తన సాక్షి ఛానల్ ద్వారా కౌంటర్లు బానే ఇచ్చేవారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం జగన్ మరొక ఛానల్ కొనడం కోసం విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఏపీ మీడియాలోనూ మరియు రాజకీయాలోనూ టాక్ వినపడుతోంది. ఇంతకీ ఆ ఛానల్ మరో ఏదో కాదు రాజ్ న్యూస్ ఛానల్. ప్రస్తుతం ఈ ఛానల్ ని నడిపిస్తున్నది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యొక్క బ్రదర్ వెంకటరెడ్డి. ఈ క్రమంలో వైసీపీ పార్టీలో సీనియర్ నాయకుడు జగన్ కుడిభుజంగా ఉండే విజయసాయిరెడ్డి సదరన్ న్యూస్ ఛానల్ ని కొనడం కోసం రంగంలోకి దిగినట్లు సమాచారం. మొత్తం మీద చూసుకుంటే జగన్ త్వరలో ఏపీలో తన పార్టీ అధికారం సంపాదించే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో మీడియా పరంగా కూడా తనకు బలమైన కోటరీ ఉండాలని ఆలోచిస్తున్నట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తోంది.Top