బిత్తరి సత్తి ని గెంటేశారా..? వెళ్లిపోయాడా..?

బిత్తరి సత్తి ని గెంటేశారా..? వెళ్లిపోయాడా..?

బిత్తరి సత్తి ని గెంటేశారా..? వెళ్లిపోయాడా..?
 
బిత్తిరి సత్తి కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. V6 చానల్లో ప్రసారం అయ్యే తీన్మార్ కార్యక్రమం ద్వారా ఎంతో ఫేమస్ అయ్యాడు. కేవలం ఈ ఒక్క కార్యక్రమం ద్వారా V6 చానల్కి టీఆర్పీ రేటింగులు ఎంతగానో పెరిగాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా బిత్తిరి సత్తి మంచి సెలబ్రిటీ. వాస్తవానికి బిత్తిరి సత్తి అలియాస్ రవి ఓ ప్రముఖ చానల్ లో ప్రసారమైన ‘కామెడీ క్లబ్’ అనే రియాలిటీ షో ద్వారా బుల్లితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత జర్నలిజం వైపు వచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. దీని అనంతరం పలు చానల్స్లో పని చేసి - 2015లో V6 లో చేరారు. దీని ద్వారా వచ్చిన పాపులారిటీతో పలు సినిమాలు - వెబ్ సిరీస్ లు - ఈవెంట్లను చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో గత కొన్ని రోజుల నుండి బిత్తిరి సత్తి రాష్ట్రానికి మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ కనబడకపోవడంతో చాలా మంది నెటిజన్లు అభిమానులు బిత్తిరి సత్తి పనిచేసే టీవీ న్యూస్ ఛానల్ యాజమాన్యం ఉద్యోగం నుండి గెంటేశార లేకపోతే తన ఉద్యోగం నుండి వెళ్లిపోయాడా తెలియక తెగ సతమతమవుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో బిత్తర సత్తి అభిమానులు అసలు విషయం తెలుసుకున్నారు. వాస్తవానికి బిత్తిరి సత్తి తండ్రి చనిపోవడంతో ఆయన అక్కడికి వెళ్లారట. అందుకోసమే రెండు రోజులుగా సత్తికి సంబంధించిన కార్యక్రమాలు ప్రసారం కావడం లేదని తెలిసింది. త్వరలోనే సత్తి హైదరాబాద్ రానున్నారని ఆ తర్వాత యథావిధిగా తన కార్యక్రమాలు చేస్తారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో సత్తి దీనిపై క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.



Top