'చంద్రబాబు చెప్పినట్టు వింటే మునిగిపోతావ్' రాహుల్ గాంధీ కి అతిపెద్ద హెచ్చరిక..!

'చంద్రబాబు చెప్పినట్టు వింటే మునిగిపోతావ్' రాహుల్ గాంధీ కి అతిపెద్ద హెచ్చరిక..!

'చంద్రబాబు చెప్పినట్టు వింటే మునిగిపోతావ్' రాహుల్ గాంధీ కి అతిపెద్ద హెచ్చరిక..!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారారు టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు. 2014 ఎన్నికల్లో బిజెపి పార్టీ తో కలసి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన చంద్రబాబు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి మోడీకి వ్యతిరేకంగా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ ఎక్కడ ఉంటే అక్కడ చంద్రబాబు వాలిపోతున్నారు. అంతే కాకుండా ఇటీవల చాలా సార్లు ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీకి శాలువాలు సన్మానాలు కూడా చేయడం జరిగింది. దీంతో ఇదంతా చూస్తున్న ఒక మాజీ సీఎం చంద్రబాబు నైజం గురించి రాహుల్ కు ఈ విషయంలో హెచ్చరిక లాంటి బోధ చేశారట. రాహుల్ కు సూటిగా కాకపోయినా.. రాహుల్ అనుచవర్గానికి ఆ మాజీ సీఎం ఈ విషయాన్ని చెప్పిందట. 'చంద్రబాబును మరీ గుడ్డిగా నమ్మేయొద్దు..' అని అన్నారట. అంతేకాకుండా చంద్రబాబు చెప్పినట్టు వింటే మునిగి పోవడం కూడా గ్యారెంటీ అని అన్నారట.. అలా అన్నది మరెవరో కాదు యూపీ మాజీ సీఎం మాయవతి. చంద్రబాబు నాయుడు రాజకీయాలను ఆమె దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు మాయవతి దగ్గరకు వెళ్లి ఫోర్త్ ఫ్రంట్ అంటూ హడావుడి చేసిన దాఖలాలు ఉన్నాయి. ఆ తర్వాత చంద్రబాబు బీజేపీ పంచన చేరిపోయాడు. క్షణక్షణానికి చంద్రబాబు రంగులు మార్చే రాజకీయ నాయకుడు అంటూ మాయావతి కామెంట్ రాహుల్ అనుచరవర్గం కి తెలియజేశారట. అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో బిజెపి పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తే ముందుగా రాహుల్ గాంధీ దగ్గర నుండి మోడీ దగ్గరికి వెళ్లే మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు అన్నట్టుగా మాయావతి రాహుల్ గాంధీ అనుచరవర్గం కి తెలియజేసినట్లు సమాచారం.



Top