కేసీఆర్, చంద్రబాబు పై సంచలన కామెంట్స్ చేసిన విజయసాయిరెడ్డి..?

కేసీఆర్, చంద్రబాబు పై సంచలన కామెంట్స్ చేసిన విజయసాయిరెడ్డి..?

కేసీఆర్, చంద్రబాబు పై సంచలన కామెంట్స్ చేసిన విజయసాయిరెడ్డి..?
 
టిడిపి అధినేత ఏపీ సీఎం చంద్రబాబు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో రాజీ పడటానికి చంద్రబాబు జీవన ప్రయత్నాలు చేస్తున్నట్లు తన అనుమానాన్ని వ్యక్తం చేశారు వైసీపీ పార్టీ సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ అయిపోయిన తర్వాత నాటినుండి సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ నాయకులపై మరియు రాష్ట్ర రాజకీయాలపై తనదైన శైలిలో కామెడీ తో చేస్తున్న విజయసాయిరెడ్డి తాజాగా ఇటీవల ట్విటర్ లో కెసిఆర్, చంద్రబాబుపై షాకింగ్ కామెంట్ చేశారు.
 
ట్విటర్ లో విజయసాయిరెడ్డి ఏమన్నారంటే...చంద్రబాబు కుల మీడియా ఒక మాఫియా రేంజ్‌లో ఎదిగిన తీరు గమనిస్తే రవి ప్రకాష్‌ లాంటి వాళ్లు అనేకమంది కనబడతారు. ప్రజాధనాన్ని దోచిపెట్టడం, బ్లాక్‌ మెయిల్‌ చేసుకోమని సమాజం మీదకు వదలడం ‘40 ఇయర్స్ ఇండస్ట్రీ’ ఇన్నాళ్లుగా చేసిన ఘనకార్యం. బాబు నీడలో ఈ మాఫియా దేశమంతా విస్తరిస్తోంది. ఏ సలహా, సహాయం కోసం రామోజీ రావుని కలిశావు చంద్రబాబూ? ప్రజాధనంతో హెలికాప్టర్‌లో వెళ్లి ఆయనను కలవాల్సినంత ముఖ్యమైన పనేమిటో ప్రజలకు చెప్పే ధైర్యం ఉందా? ఓడిపోయిన తర్వాత ఎక్కడ ఆశ్రయం పొందాలో అడగడానికా? కేసీఆర్‌తో రాజీ చేయమని ప్రాధేయపడటానికి వెళ్లావా? ఇంత దిగజారిపోయావేంటి బాబూ? అని విజయసాయి ప్రశ్నించారు. దీంతో విజయసాయి రెడ్డి చేసిన కామెంట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ అయింది.Top