బాబు మైండ్ గేమ్ ఆయన మీదకే ఎదురు తిరిగింది - భారీ దెబ్బ ఇది !

Written By Siddhu Manchikanti | Updated: May 18, 2019 09:58 IST
బాబు మైండ్ గేమ్ ఆయన మీదకే ఎదురు తిరిగింది - భారీ దెబ్బ ఇది !

బాబు మైండ్ గేమ్ ఆయన మీదకే ఎదురు తిరిగింది - భారీ దెబ్బ ఇది!
 
ఏపీ రాజకీయాలలో టీడీపీ అధినేత చంద్రబాబు కి చాణిక్యుడు అనే బిరుదు ఉంది. ముఖ్యంగా ప్రత్యర్థులను ఇబ్బందులకు గురి చేయడంతో చంద్రబాబు ఆడే మైండ్ గేమ్ తట్టుకోవడం ఎవరి వల్ల కాదని చాలామంది 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన సీనియర్ రాజకీయ నేతలు కామెంట్ చేస్తుంటారు. ముఖ్యంగా 2009 ఎన్నికల ముగిశాక వైయస్సార్ గెలిచాక తదనంతరం వైఎస్ మరణించాక..జగన్ వేసిన అడుగులకు చంద్రబాబు వేసిన మైండ్ గేమ్ దెబ్బలకు జగన్ బీభత్సంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని చాలామంది పొలిటికల్ విశ్లేషకులు కామెంట్ చేస్తుంటారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగాక ఆంధ్రప్రదేశ్లో తన ప్రత్యర్థి జగన్ అవతరించడంతోముందుగానే తనకు అనుకూలంగా ఉండే ఎల్లో మీడియా తో..జగన్ ఒక అవినీతిపరుడు లక్ష కోట్లు దోచుకున్న దొంగ అన్నట్టుగా చిత్రీకరించడంలో చంద్రబాబు ఆడిన మైండ్ గేమ్ లో ఆంధ్ర ప్రజలు నిజంగా దొరికిపోయారని చాలా మంది రాజకీయ నేతలు కామెంట్ చేస్తుంటారు.
 
అయినా కానీ జగన్ వాటినన్నిటిని ఎదుర్కొని కేవలం 5% ఏజ్ ఓటింగ్తో 2014 ఎన్నికల్లో అధికారం కోల్పోవడం జరిగింది. కానీ ఇప్పుడు 2019 ఎన్నికల్లో జగన్ చంద్రబాబు వేసిన ప్రతి మైండ్ గేమ్ ని ఎదుర్కొని విజయవంతంగా అధికారం చేజిక్కించుకోవడం గ్యారెంటీ అన్న విధంగా రాజకీయం చేయడం తో చంద్రబాబు ఆడిన మైండ్ గేమ్ ఇప్పుడు చంద్రబాబుకే చేటు తెచ్చిపెట్టే టట్లు ఉంది అని చాలామంది భావిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఏ చానల్స్ అయితే జగన్ పై దుష్ప్రచారం చేసే వాటి గా ఉండేవో అవి ప్రస్తుతం మెల్ల మెల్లగా జగన్ కి అనుకూలంగా మారుతున్నట్లు...దీంతో ఇప్పుడు ఆ చానల్స్ లో చంద్రబాబుపైనే వ్యతిరేకంగా కథనాలు కూడా ప్రసారం కాబోతున్నట్లు ఏపీ రాజకీయాల్లో వినపడుతున్న టాక్. మొత్తం మీద చూసుకుంటే ప్రస్తుతం చంద్రబాబు రాజకీయ కెరియర్ చాలా డ్యామేజ్ లో ఉండటంతో ముందుగానే సదరు మీడియా చానల్స్ తమ జాగ్రత్తని చూసుకుంటూ జగన్ కి అనుకూలంగా మారిపోయాయని అంటున్నారు చాలామంది పొలిటికల్ విశ్లేషకులు.
Top