ఈ రవిప్రకాశ్ మామూలోడు కాదు రో!

Written By Siddhu Manchikanti | Updated: May 18, 2019 10:08 IST
ఈ రవిప్రకాశ్ మామూలోడు కాదు రో!

ఈ రవిప్రకాశ్ మామూలోడు కాదు రో!
 
సమాజం నీతి నిజాయితీలు అని చెప్పే టీవీ9 రవి ప్రకాష్ గురించి ప్రస్తుతం వస్తున్న వార్తలు వింటే ప్రజలు నోరెల్లపెడుతున్నారు. ఫోర్జరీ సంతకం కేసులో ఇటీవల అనేక ఆరోపణలు ఎదుర్కొని మరికొద్ది రోజుల్లో అరెస్టుకు కూడా సిద్ధమవుతున్న రవి ప్రకాష్ గురించి దారుణమైన వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా టీవీ9 చానల్ కుచెందిన సంస్థ ఒకటి ఉందిగా. దానికి సంబంధించిన ఆరు లోగోలు.. అందులో టీవీ9 లోగో కూడా ఉంది.
 
ఆ లోగోల్ని రవిప్రకాశ్ సొంత సంస్థ మోజోటీవీకి చెందిన కంపెనీకి కేవలం రూ.99వేలకు అమ్మేసిన వైనం తాజాగా బయటకు వచ్చింది. టీవీ9 కొత్త యాజమాన్యానికి (90 శాతానికి మించి షేరున్న అలందా మీడియా) షాకిస్తూ లోగోల అమ్మకానికి సంబంధించిన విషయాన్ని వారు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కౌశిక్ రావు పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం.. రవిప్రకాశ్.. మూర్తి.. హరికిరణ్ చేరెడ్డి కలిసి టీవీ9 లోగోలను మోజోటీవీ యాజమాన్య సంస్థ మీడియా నెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు కేవలం రూ.99వేలకు అమ్మేసిన వైనాన్ని సైబర్ పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియా లో కి రావటం తో ఇంత కక్కుర్తి పడే వ్యక్తి సమాజంలో నీతి నిజాయితీ అంటూ మాట్లాడటం నిజంగా మన దురదృష్టకరం...వీడు మామూలోడు కాదు ఇంకొద్దిగా టైమింగ్ ఇచ్చి ఉంటే ఇంకెన్ని ఘోరాలు చేసి ఉండేవాడో అన్ని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.




Top