జగన్ పై సంచలన కామెంట్స్ చేసిన కేవీపీ..!

Advertisement

by Siddhu Manchikanti | May 22, 2019 10:17 IST
Follow Xappie
జగన్ పై సంచలన కామెంట్స్ చేసిన కేవీపీ..!

జగన్ పై సంచలన కామెంట్స్ చేసిన కేవీపీ..!
 
వైయస్ ఆత్మ గా పిలవబడే కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు వైసీపీ పార్టీ అధినేత జగన్ పై సంచలన కామెంట్ చేశారు. వైయస్ జగన్తో తనకు ఉన్న అనుబంధం తెగిపోయేది కాదని స్పష్టం చేశారు. గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైయస్ ఫ్యామిలీకి మరియు వైయస్ వేసే ప్రతి రాజకీయ అడుగుకి అతి దగ్గరగా అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన కెవిపి..వైయస్సార్ సిపి పార్టీ అధినేత జగన్ తనకు మేనల్లుడు లాంటివాడిని పేర్కొన్నారు. అంతేకాకుండా తమ అనుబంధం వ్యక్తిగతమని, రాజకీయాలకు సంబంధం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఇక జగన్ తాను ఎంచుకున్న దారిలో నడుస్తున్నారని కేవీపీ పేర్కొన్నారు.
 
యూపీఏలో జగన్‌ను కలపాలని తనను అధిష్టానం కోరలేదని.. ఒకవేళ ఆ బాధ్యతలు తనకు అప్పగిస్తే, నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. జగన్‌కు సీట్లు పెరిగతే తమతో కలుపుకోవాలని యూపీఏ చూస్తుందన్న విషయం కూడా తనకు తెలీదని చెప్పారు. ఇక ప్రస్తుతం తాను జగన్‌తో ఎందుకు లేనన్న విషయాన్ని ఓపెన్‌గా చెప్పలేనని.. దాని గురించి చర్చించే సమయం ఇది కాదని వివరించారు.


Advertisement


Advertisement

Top