పవన్ కళ్యాణ్ ఓటమిపై హాట్ కామెంట్స్ చేసిన జబర్దస్త్ కమెడియన్..!

పవన్ కళ్యాణ్ ఓటమిపై హాట్ కామెంట్స్ చేసిన జబర్దస్త్ కమెడియన్..!

పవన్ కళ్యాణ్ ఓటమిపై హాట్ కామెంట్స్ చేసిన జబర్దస్త్ కమెడియన్..!
 
2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం నుండి మరియు విశాఖపట్నం గాజువాక నియోజకవర్గం నుండి అసెంబ్లీకి పోటీ చేయడం జరిగింది. అయితే తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన క్రమంలో రెండు చోట్ల పవన్ కళ్యాణ్ పోటీ చేసిన నియోజకవర్గాలలో పవన్ కళ్యాణ్ ఓటమి పాలవడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా ఇండస్ట్రీకి చెందిన వారు మరియు మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ ఓడిపోవడం తమకు ఎంతగానో బాధ తెలుగు చేసిందని కామెంట్స్ సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ తరుపున ప్రచారం చేసిన హైపర్ ఆది పవన్ కళ్యాణ్ ఓటమిపై ఊహించని విధంగా సోషల్ మీడియాలో హాట్ కామెంట్స్ చేశాడు.
 
మనీ, మద్యం ముందు మానవత్వం ఓడిపోయింది. ఈ రోజు ఓడిపోయింది పవన్ కల్యాణ్ కాదు.. తెలుగు ప్రజలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఈరోజు బ్లాక్ డే’’ అంటూ ఆది చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హైపర్ ఆది జనసేనకు సంబందించిన ప్రచారాల్లో మీటింగ్ లలో పాల్గొని పవన్ కోసం ప్రచారం కూడా చేశాడు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు నెగిటివ్ కామెంట్స్ కౌంటర్లువేస్తూ వచ్చాడు. గాజువాక - భీమవరం స్థానాల్లో పవన్ గట్టిపోటీ ఇచ్చినప్పటికీ ఆ స్థానాల్లో వైసిపి అభ్యర్థులు వైసీపీ అభ్యర్థి నాగిరెడ్డి, గ్రంథి శ్రీనివాస్ గెలుపొందారు.Top