అరెస్ట్ తప్పించుకోవడం కోసం రవి ప్రకాష్ కష్టాలు!

Advertisement

by Siddhu Manchikanti | May 29, 2019 17:26 IST
Follow Xappie
అరెస్ట్ తప్పించుకోవడం కోసం రవి ప్రకాష్ కష్టాలు!

అరెస్ట్ తప్పించుకోవడం కోసం రవి ప్రకాష్ కష్టాలు!
 
ఫోర్జరీ కేసు లో టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ వ్యవహరిస్తున్న తీరు అరెస్టుకు దారితీసినట్లు ఉంది. టీవీ9 సంస్థలో ఉంటూ అక్రమంగా వాటాదారులను బెదిరిస్తూ ఎక్కువ లాభాలు పొందుతారు అంటూ అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న రవి ప్రకాష్ కి గత కొన్ని రోజుల నుండి హైకోర్టు నుండి వస్తున్న నోటీసులను కూడా లెక్కచేయకుండా విచారణకు హాజరు కాకుండా ఉంటున్న నేపథ్యంలో పోలీసులు రవి ప్రకాష్ ను అరెస్టు చేయడానికి బృందాలుగా తిరుగుతూ పట్టుకోవడానికి ప్రయత్నాలు జరుపుతున్నట్లు సమాచారం.
 
ఇదిలావుండగా ముందస్తు బెయిల్ కోసం ఇటీవల హైకోర్టును రవిప్రకాశ్ ఆశ్రయించగా రవి ప్రకాష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. ఈ సందర్భంగా రవిప్రకాష్ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించడం జరిగింది. మరికొద్ది గంటల్లో విచారణకు రాబోతున్న రవిప్రకాష్ పిటిషన్లో ఎక్కువగా వేలు పొందడానికి ఎక్కువ అవకాశాలు ఉన్న క్రమంలో అతడి కేసు దర్యాప్తు కి సహకరిస్తే కేసులో అతను తప్పు చేయలేదు అని విచారణలో తేలితే రవి ప్రకాష్ క్లియరెన్స్ సర్టిఫికెట్ దక్కడం ఖాయం.
 
లేకపోతే అల్లందా మీడియా దాఖలు చేసిన ఫోర్జరీ, డేటా దొంగతనం మరియు లోగో అమ్మకపు కేసుల కేసుల నుండి ప్రశ్నావళిని ఎదుర్కోకుండా అరెస్టు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న రవి ప్రకాష్ ను పోలీసులు అరెస్టు చేయడం కాయం. ఏది ఏమైనా న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తూ అరెస్టు కాకుండా రవిప్రకాష్ నానా తంటాలు పడుతున్నారు.


Advertisement


Advertisement

Top