చంద్రబాబు నాయకత్వాన్ని ఎదిరించే వాడే లేడు అనుకోగానే ఎన్‌టి‌ఆర్ దిగాడు రంగంలోకి !!

Written By Siddhu Manchikanti | Updated: May 29, 2019 17:39 IST
చంద్రబాబు నాయకత్వాన్ని ఎదిరించే వాడే లేడు అనుకోగానే ఎన్‌టి‌ఆర్ దిగాడు రంగంలోకి !!

చంద్రబాబు నాయకత్వాన్ని ఎదిరించే వాడే లేడు అనుకోగానే ఎన్‌టి‌ఆర్ దిగాడు రంగంలోకి !!
 
తెలుగుదేశం పార్టీని స్థాపించిన నందమూరి తారకరామారావు గారి కుటుంబానికి చెందిన ఏ ఒక్క వ్యక్తి చేతిలో తెలుగుదేశం పార్టీ లేకుండా చంద్రబాబు చాలా తెలివిగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న టిడిపి నేతల చేతుల్లోనే పెట్టుకొని ఇన్నేళ్లు రాజకీయం చేశారు ఇప్పుడు కాలం మారింది చంద్రబాబుకి చెప్పాలి చూపించడానికి ఎన్టీఆర్ రంగంలోకి దిగాడు అని చాలా మంది టీడీపీ సీనియర్ నేతలు కామెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో అడ్రెస్స్ లేకుండా పోయిన టిడిపి తాజాగా జరిగిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలలో కూడా చావు దెబ్బ తిన్నట్టు అయ్యింది.
 
దాదాపు 175 స్థానాలకు గాను ఇరవై మూడు స్థానాలకు పరిమితం అయ్యింది టీడీపీ. ఈ క్రమంలో ఇటీవల ఎన్టీఆర్ జయంతి సమయంలో ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఏ మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు సరైన శ్రద్ధ చూపించకుండా..సమాధిని అలంకరించకుండా కేవలం రాజకీయ లాభం తోనే అప్పట్లో ఎన్టీఆర్ ఘాట్ దగ్గర హడావిడి చేసిన చంద్రబాబు తాజాగా జరిగిన ఎన్నికలలో టిడిపికి దారుణంగా ప్రజలు బుద్ధి చెప్పడంతో ఎన్టీఆర్ సమాది ఏ మాత్రం పట్టించుకోకుండా ఎన్టీఆర్ జయంతి వేడుకలు గుంటూరు జిల్లాలో నిర్వహించిన క్రమంలో...హైదరాబాదులో ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నివాళులర్పించడానికి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తన తాత ఎన్టీఆర్ బోసిపోయిన సమాధిని చూసి..వెంటనే అక్కడ ఉన్న తన అభిమానులను పిలిపించి పూలను తెప్పించి ఎన్టీఆర్ సమాధి అలంకరించి...రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ కి సంబంధించిన ప్రతి వేడుకను నేనే చూసుకుంటాను అని జూనియర్ ఎన్టీఆర్ అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులతో మరియు కొంతమంది నందమూరి కుటుంబానికి చెందిన కుటుంబ సభ్యులతో తెలిపారట.
 
దీంతో ఈ విషయం బయటకు రావడంతో ఇన్నాళ్ళు టీడీపీలో తనకు ఎదురుచెప్పేవారే లేరు అని అనుకుంటున్న చంద్రబాబుకి ...జూనియర్ ఎన్టీఆర్ రూపంలో ఎదిరించే వాడు ఒకడు వచ్చారని రాజకీయవిశ్లేషకులు కామెంట్లు చేస్తున్నారు.




Top