వైయస్ జగన్ కి కొత్త పేరు పెట్టిన శివసేన పార్టీ…!

Advertisement

by Siddhu Manchikanti | May 31, 2019 10:36 IST
Follow Xappie
వైయస్ జగన్ కి కొత్త పేరు పెట్టిన శివసేన పార్టీ…!

వైయస్ జగన్ కి కొత్త పేరు పెట్టిన శివసేన పార్టీ…!
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ మోహన్ రెడ్డి పై శివసేన పార్టీ సంచలన కరమైన వ్యాఖ్యలు చేసింది. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుని చిత్తు చిత్తుగా ఓడించి అతి చిన్న వయసులోనే అధికారాన్ని సంపాదించిన శివసేన పార్టీ జగన్‌ని ‘విజయ వీరుడు’గా అభివర్ణించింది. ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే మోడీని కలిసిన జగన్‌ ఏపీ రాష్ట్ర డిమాండ్లపై చర్చించారని శివసేన గుర్తు చేసింది. వాటికి మోడీ అంగీకరించినట్లు తెలిపింది.
 
బిజెపి మాత్రం రాష్ట్రంలో ఘోర పరాజయాన్ని చవి చూసిందని వ్యాఖ్యానించింది. మోడీ ప్రమాణస్వీకారానికి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాకపోవడంపై శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. మోడీ మరోసారి ప్రధాని బాధ్యతలు చేపడితే ప్రజాస్వామ్యానికి ప్రమాదమని విపక్షాలు ప్రజల్లో అనుమానాలు రేకెత్తించాయని అన్నది. మోడీని నియంతగా ప్రచారం చేసిన వారిలో మమతా బెనర్జీ ముందున్నారని గుర్తు చేసింది. మోడీ మాత్రం ప్రజాస్వామ్యబద్దంగా జరిగిన ఎన్నికల్లో గెలిచి రాజ్యాంగం ప్రకారం ప్రమాణంచేయబోతున్నారని తెలిపింది.


Advertisement


Advertisement

Top